ప్రభుదేవా ఈ సారి సూపర్ స్టార్ రీమేక్ తో...
ప్రభుదేవా వరసగా హిందీలో రీమేక్ లు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. తాజాగ ఆయన సౌతిండియా సూపర్ స్టార్ ..సూపర్ హిట్ చిత్రం బాషాని హిందీలో చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అజయ్ దేవగన్ హీరోగా రూపొందే ఈ చిత్రం ఈ కాలానికి తగినట్లుగా కొద్ది మార్పులు చేసి తెరకెక్కించటానికి రెడీ అవుతన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రీమేక్ రైట్స్ కోసం భాషా నిర్మాతలను సంప్రదించినట్లు చెన్నై మీడియా లో వినపడుతోంది. ఇప్పటికే ఓ టీమ్ ..భాషా స్క్ర్రిప్టులో ఛేంజ్ లు రాసి,నార్త్ కి తగినట్లు కామిడీని మార్చి తిరగరాస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రభుదేవా బాలీవుడ్ లో 'రౌడీ రాథోర్' అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అక్షయ్ కుమార్ హీరోగా చేస్తున్న ఈ చిత్రం తెలుగులో రాజమౌళి-రవితేజ కాంబినేషన్లో వచ్చిన 'విక్రమార్కుడు' చిత్రానికి రీమేక్. ఈ చిత్రానికి విపరీతమైన క్రేజ్ రావటంతో బాలీవుడ్ హీరోల దృష్టి మొత్తం ప్రభుదేవాపై పడింది. అందులోనూ సల్మాన్ ఖాన్ తో పోకిరి రీమేక్ ని వాంటెండ్ పేరుతో తీసి సూపర్ హిట్ చేయటం,ఇప్పుడు దక్షిణాది చిత్రాక కధల హవా నడవటం ఈ ప్రభుదేవాకు కలిసివచ్చింది. సంజయ్ లీలా భన్సాలి వంటి దర్శకుడు సైతం ఈ మాస్ సబ్జెక్టుతో హిట్ ఖాయం అని నమ్మి నిర్మిస్తున్నారు.
పోకిరీ ని వాంటెడ్ మార్చి బాలీవుడ్ లో హిట్ కొట్టిన ప్రభుదేవాపై నమ్మకంతో ఈ ప్రాజెక్టుని అప్పచెప్పారు. సోనాక్షి సిన్హా ఈ చిత్రంలో అనూష్క పాత్రను చేయనుంది. ఈ చిత్రం పక్కా మాస్ మశాలా గా రూపొందించటానికి ప్రభుదేవా కసరత్తులు చేస్తున్నారు. అక్షయ్ కుమార్ సైతం చాలా రోజుల తర్వాత తాను ఇలాంటి మాస్ హీరో పాత్ర చేయటంతో చాలా సంతోషంగా ఉన్నాడు.ప్రభుదేవా దర్శకత్వంలో సంజయ్ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఆ మధ్య తమిళంలో కార్తీ హీరోగా చిరుతై క్రింద రీమేకైంది.
ఇక భాషా విషయానికి వస్తే దాన్ని సురేష్ కృష్ణ డైరక్ట్ చేసాడు. ఫ్లాష్ బ్యాక్ నేరేషన్ కథలకు,సినిమాలకు ఈ చిత్రం నుంచే ఊపు వచ్చింది. భాషా స్పూర్తితో ఇప్పటికీ తెలుగులో ఆ తరహా సినిమాలు తయారవుతున్నాయి. భాషా చిత్రం నిజానకి అమితాబ్ నటించిన హమ్ స్పూర్తితో రూపొందింది అంటారు. హమ్ చిత్రంలో రజనీకాంత్ సైతం ఓ కీ రోల్ ని చేసారు. ఇప్పుడు మళ్లీ అదే భాషా..హిందీలో రూపొందటంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











