పోకిరి సీక్వెల్ పనిలో ప్రభుదేవా
పోకిరి హిందీ రీమేక్ వాంటెడ్ మంచి హిట్ ని సాధించిన సంగతి తెలిసిందే. దాంతో ఆ చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేయనున్న్ట్లు సమాచారం. ఇందుకోసం కొంత మంది రచయతలు కుస్తీ పడుతున్నట్లు తెలుస్తోంది. నిజానికి పూరీ జగన్నాధ్ ఈ చిత్రం సీక్వెల్ చేయాలని అప్పట్లో రజనీకాంత్ కూతరు తో ఎగ్రిమెంట్ చేసుకున్నారు. అయితే అనుకోన అవాంతరాల వల్ల దాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారు. ఇక ఈ సీక్వెల్ లోనూ సల్మాన్ ఖాన్ హీరోగా చేయనున్నారని చెప్తున్నారు. అది కూడా వర్కవుట్ అయితే విజయ్ తో తమిళంలోనూ చేసే అవకాశముంది. పోకిరిని తమిళంలో విజయ్ హీరోగా ప్రభుదేవా డైరక్ట్ చేసి మంచి విజయం సాధించారు. ప్రస్తుతం ప్రభుదేవా వాంటెడ్ విజయానందాన్ని ఆస్వాదిస్తున్నారు.
వాంటెడ్ సల్మాన్ ఖాన్ ప్రభుదేవా పోకిరి మహేష్ విజయ్ ఇలియానా ఆసిన్ సీక్వెల్ రీమేక్ prabhudeva pokiri sequel wanted salmankhan vijay asin iliyana mahesh


Click it and Unblock the Notifications