నువ్వు వస్తానంటే నే వద్దంటానా చిత్రంతో దర్శకుడుగా పరిచయమైన కొరియోగ్రాఫర్ ప్రభుదేవా పౌర్ణమి ఫ్లాఫ్ తో తెలుగుకి స్వస్తి చెప్పాడు. తమిళంలో విల్లు అంటూ విజయ్ కి డిజాస్టర్ ఇచ్చిన ఈ దర్శకుడు మళ్ళీ తన హిట్ హీరో సిద్దార్ధ తో సినిమా చేయటానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. అందులోనూ ఇద్దరి మద్యా మంచి స్నేహం ఉండటం, ఇద్దరూ తమిళులే కావటంతో వెంటనే సిద్దూ ఓకే చేసేసాడని సమాచారం. ఓ విభిన్నమైన రొమాంటిక్ కామెడీ కధని ఈ చిత్రం కోసం ప్రభుదేవా రెడీ చేసాడని తెలుస్తోంది. అయితే సిద్దు తాను కూడా స్క్రిప్టులో కూర్చుని మరింత షార్పుగా కథనాన్ని చేద్దామని చెప్పాడు. తెలుగు రచయిత వీరూ పోట్ల కూడా ఈ స్క్రిప్టు లో తన వంతు సాయిం చేసాడని తెలుస్తోంది. ఇంతకు ముందు కొంచెం ఇష్టం..కొంచెం కష్టం చిత్రానికి కూడా సిద్దు కోరికపైనే వీరూ పోట్ల, జోష్ డైరక్టర్ వాసు వర్మ, మరో ఇద్దరు తమిళ స్క్రీన్ ప్లే రైటర్స్ ని పిలిపించారు. ప్రస్తుతం స్దిదార్ద చేసిన ఓయ్ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది.