ప్రభుదేవా డైరక్ట్ తెలుగులో..?
'నువ్వు వస్తానంటే...నే వద్దంటానా'చిత్రంతో దర్శకుడుగా మారిన డాన్స్ డైరక్టర్ ప్రభుదేవా ఈ మధ్యన తెలుగు పరిశ్రమకు దూరమయ్యారు.అలాగే 'శంకర్ దాదా జిందాబాద్' అనంతరం తెలుగులో అడపాదడపా నృత్య దర్శకత్వం వహిస్తున్నా దర్శకత్వం మాత్రం వహించటం లేదు. అయితే విశాల్ హీరోగా ఆయన తాజాగా ఓ తెలుగు చిత్రం ప్లాన్ చేస్తున్నాట్లు సమాచారం. 'పిస్తా' ఫ్లాప్ తో విశాల్ కి తెలుగు మార్కెట్ సైతం డల్ గా మారటంతో ఇక్కడో డైరక్ట్ హిట్ ఇవ్వాలని నిర్మయించుకున్నట్లు తెలుస్తోంది.దాంతో మొదట తెలుగులో ఈ చిత్రం రూపొందించి తర్వాత తమిళంలోకి డబ్ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందునిమిత్తం విశాల్ దగ్గరుండి మరీ ఓ యాక్షన్ బ్యాక్ డ్రాప్ స్క్రిప్టు రెడీ చేయించాడని అంటున్నారు. అయితే దర్శకత్వంలో వేలు పెట్టే విశాల్ తో ప్రభుదేవా ఎలా వేగుతాడని కొందరంటున్నారు.ఇక ప్రభుదేవా డైరక్ట్ చేసిన హిందీ పోకిరి(వాంటెడ్)ఈ వారమే రిలీజవబోతోంది. అది మంచి విజయం నమోదు చేస్తే బాలీవుడ్ లోనూ అవకాశాలు వెల్లువెత్తటం ఖాయం. ఏదైమైనా తెలుగులో డైరక్ట్ సినిమా చేయాలన్న ప్రభుదేవా ఆలోచన ఆయన అభిమానులను ఆనందంలో ముంచెత్తుతోంది.


Click it and Unblock the Notifications











