ఐదుగురు హీరోయిన్లతో ప్రభుదేవా.. వైరల్‌గా సైకో లుక్

కొరియోగ్రాఫర్‌గా, నటుడిగా, దర్శకుడిగా బాలీవుడ్‌లోనే కాకుండా తమిళ చిత్ర పరిశ్రమలో బిజీగా ఉంటున్నారు. ఓ వైపు సల్మాన్ ఖాన్, శ్రద్దాకపూర్ లాంటి టాప్ హీరో, హీరోయిన్లతో సినిమాలు తీస్తూనే నటుడిగా బిజీగా మారిపోయారు. ఓ వైపు బాలీవుడ్‌లో రాధే అనే సినిమాను తెరకెక్కిస్తూనే తమిళంలో మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఓ చిత్రంలో ప్రభుదేవా సరసన ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారనేది తాజా సమాచారం. ఆ ఐదుగురు హీరోయిన్లు ఎవరంటే..

హిందీలో సల్మాన్‌తో రాధే

హిందీలో సల్మాన్‌తో రాధే

ప్రస్తుతం హిందీలో దబాంగ్3 తర్వాత సల్మాన్ ఖాన్‌తోనే రాధే అనే చిత్రాన్ని ప్రభుదేవా తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో దిశా పటానీ, రణ్‌దీప్ హుబా, జాకీ ష్రాఫ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దక్షిణ కోరియాలో విజయవంతమైన వెటరన్ సినిమాకు ఇది రీమేక్. నవంబర్‌ నుంచి బిజీగా షూటింగ్ జరుగుతున్నది.

తమిళంలో మూడు చిత్రాలు

తమిళంలో మూడు చిత్రాలు

దర్శకత్వం బాధ్యతలతో పాటు నటుడిగా తెరపైన సత్తా చాటుతున్నాడు ప్రభుదేవా. తమిళంలో ఏసీ ముగిల్ చెల్లప్పన్ దర్శకత్వంలో పోన్ మణికావేల్ అనే చిత్రంలో విభిన్నమైన పాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రమే కాకుండా థీల్, ఊమై విజిగల్, భగీరా అనే మూడు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఐదుగురు హీరోయిన్లతో

ఐదుగురు హీరోయిన్లతో

తమిళ దర్శకుడు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించే బఘీరా చిత్రంలో విభిన్నమైన పాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రభుదేవా సరసన అమీరా దస్తర్, గాయత్రి హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరితోపాటు మరో ముగ్గురు కొత్త హీరోయిన్లను జోడిగా పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

Recommended Video

Power Star Pawan Kalyan Clap For Sai Dharam New Movie
బఘీరాలో సైకోగా..

బఘీరాలో సైకోగా..


ఇటీవల విడుదలైన బఘీరా చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌కు విశేష స్పందన వస్తున్నది. దాంతో సైకో, థ్రిల్లర్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇంకా ముగ్గురు హీరోయిన్లు ఎవరనే విషయంపై కోలీవుడ్‌లో భారీ చర్చ జరుగుతున్నది. ఇంతకు ఆ ముగ్గురు ఎవరై ఉంటారో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X