»   » ప్రభుదేవా భార్య నిరాహార దీక్ష...టెన్షన్

ప్రభుదేవా భార్య నిరాహార దీక్ష...టెన్షన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

నయనతారతో ప్రభుదేవా ప్రేమ వ్యవహారాన్ని నిరసిస్తూ ఆయన భార్య రమలత్ నిన్న(మంగళవారం) చెన్నైలో నిరాహారదీక్షకు దిగారు. అయితే బంధువులు, సన్నిహితుల జోక్యంతో ఆమె వెంటనే దీక్ష విరమించుకున్నట్లు తెలుస్తోంది. అంతకముందు ఈ నెల 24న చెన్నై వస్తున్న ప్రభుదేవాకు నచ్చజెప్పాలని రమలత్, తమ కుటుంబ సన్నిహితులతో మంతనాలు జరిపారు. అప్పటికీ ఆయన వినకుంటే నిరాహారదీక్షకు దిగాలని సన్నాహా లు చేసుకున్నారు. అయితే, హఠాత్తుగా ఆమె మంగళవారం సాయంత్రం స్థానిక అన్నానగర్‌లో దీక్షకు దిగడంతో సన్నిహితులు వారించి ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లినట్లు సమాచారం. ఇక ఈ విషయం విన్న ప్రభుదేవా టెన్షన్ పడుతున్నారని, ఆమెకు నచ్చచెప్పటానికి తగిన వాళ్ళను పంపే ప్రయత్నాల్లో ఉన్నాడని తెలుస్తోంది. నయనతార మాత్రం ఇవన్నీ సహజమే అన్నట్లు క్యాజువల్ గా మీడియాకు నో కామెంట్ అని చెప్పి తప్పించుకుంటోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu