twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈ స్టోరీలో ప్రభుదేవా నే విలన్‌

    By Srikanya
    |

    హైదరాబాద్: నృత్య దర్శకుడు, నటుడు, దర్శకుడు గా తానేంటో నిరూపించుకున్న ప్రభుదేవా ఇప్పుడు విలన్ గా మరో అవతారం ఎత్తుతున్నారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టు గా గతంలో కనిపించిన ఆయన విలన్ గా చేయటం ఇదే తొలిసారి. రెమో డిసౌజా డైరెక్ట్‌ చేసిన మొదటి సినిమా ‘ఎబిసిడి - ఎనీబడీ కెన్‌ డాన్స్‌'లో ప్రభుదేవా ఓ డాన్స్‌ ట్రూప్‌కు శిక్షకునిగా ప్రధాన పాత్ర పోషించి ఆకట్టుకున్నాడు. అయితే ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్‌ ‘ఎబిసిడి 2'లో ఆయన విలన్‌గా కనిపించబోతున్నట్లు సమాచారం.

    పూర్తి వివరాల్లోకి వస్తే... ఈ చిత్రంలో వరుణ్‌ ధావన్‌, శ్రద్ధా కపూర్‌ యువ జంటగా నటిస్తున్నారు. నిజ జీవితంలో ముంబైకి చెందిన ఓ డాన్స్‌ ట్రూప్‌కు ఎదురైన అనుభవాల ఆధారంగా ఈ సినిమాని రెమో రూపొందిస్తున్నాడు. ఇందులో ప్రభుదేవా పోషిస్తున్న పాత్రలో నెగటివ్‌ ఛాయలుంటాయని యూనిట్‌ వర్గాలు తెలిపాయి.

    ఇండియన్‌ మైఖేల్‌ జాక్సన్‌గా పేరుపొందిన ప్రభుదేవాతో కలిసి ఓ సాంగ్‌లో డాన్స్‌ చేసినప్పుడు ఎంతో ఎగ్జయిట్‌ అయ్యానని చెప్పింది శ్రద్ధ. హెయిర్‌ స్టయిలిస్ట్‌గా పనిచేస్తూ వరుణ్‌ ధావన్‌ డాన్స్‌ ట్రూప్‌తో కలిసే విన్నీ అనే అమ్మాయిగా ఇందులో ఆమె నటిస్తోంది. ఏదేమైనా ఈ సినిమాలో ప్రభు విలన్‌గా కనిపించనున్నాడనేది అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న అంశం.

    Prabhu Deva will be Villan in ABCD movie part 2

    ప్రభుదేవా పర్శనల్ జీవితం విషయానికి వస్తే...

    ప్రభుదేవాపై బాలీవుడ్‌లో ఒక కొత్త ప్రచారం మొదలైంది. ఒక ముంబాయి నృత్య దర్శకురాలి ప్రేమలో ప్రభు పడ్డారని, త్వరలోనే ఆమెను పెళ్లి చేసుకోనున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రభుదేవా మొదట్లో రమలత్ అనే డ్యాన్సర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం విదితమే. ఆ తర్వాత మనస్పర్థల కారణంగా ప్రభుదేవా, రమలత్ విడిపోయి వివాహ రద్దు పొందారు.

    అందుకు కారణం నటి నయనతారనే ప్రచారం జరిగింది. ప్రభుదేవా నయనతారలు ప్రేమించుకున్నప్పటికీ పెళ్లి పీటలెక్కలేదు. కాగా ప్రస్తుతం ప్రభుదేవా బాలీవుడ్‌లో ప్రముఖ దర్శకుడిగా ప్రకాశిస్తున్నారు. ఆయన తెరకెక్కించిన వాంటెడ్, రౌడీ రాథోర్ లాంటి చిత్రాలు ఘన విజయాన్ని సాధించాయి.

    ఆమధ్యన ప్రభుదేవా తన చిత్రాల్లో వరుసగా సోనాక్షి సిన్హాకు అవకాశమివ్వడం వీరిద్దరి మధ్య ఏదో ఉందనే ప్రచారం హోరెత్తింది. తాజాగా ప్రభుదేవా బాలీవుడ్ నృత్య దర్శకురాలితో షికార్లు కొడుతున్నట్లు త్వరలో ఆమెను పెళ్లి చేసుకోనున్నట్లు బాలీవుడ్ మీడియా అంటోంది.

    English summary
    Prabhu Deva will be Villan in ABCD movie part 2. Prabhu had earlier directed Tamil film “Pokkiri”, which he later remade in Hindi as “Wanted”.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X