ప్రభుదేవా తాజాగా ప్రియమణి...
ప్రభుదేవాకి ఇన్నాళ్ళూ ఇష్టమైన హీరోయిన్ నయనతార అని ప్రచారం జరుగుతూ వస్తోంది. అయితే ప్రియమణి అతనికి ప్రియమైన హీరోయిన్ అని స్వయంగా చెప్పుకొచ్చాడు. పోకిరి రీమేక్ వాంటెడ్ తో హిట్ కొట్టిన ప్రభుదేవాతో ఓ వెబ్ సైట్ వారు చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంలో ఓ పాఠకుడు మీకు ఇష్టమైన హీరోయన్ ఎవరు?.. నయన్ కాకుండా? అని అడగ్గానే ప్రియమణి అని సమాధానమిచ్చారు. ఎందుకు ఇష్టమో మాత్రం చెప్పలేదు. నయనతారను వివాహం చేసుకున్నారా? అనే ప్రశ్నకు 'నో' అనే పదమే సమాధానం వచ్చింది. తమపై వస్తున్న వార్తలకు వివరణ ఇచ్చేందుకు ఆసక్తి చూపలేదు. అలాగే ప్రియమణికి తన తదుపరి చిత్రంలో హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తారా అంటే చెప్పలేం అనే సమాధానం వచ్చింది. ఇక పాఠకులు చాలా మంది నయనతారతో ప్రభుదేవా ఎఫైర్ పైనే దృష్టి కలిగి ఉండటం ఆశ్చర్యం కలిగించింది. ప్రస్తుతం ప్రియమణి ..మదన్ దర్శకత్వంలో ప్రవరాఖ్యుడు చిత్రంలో చేస్తోంది. జగపతిబాబు తో చేసిన పెళ్ళయిన కొత్తలో మంచి విజయం సాధించటంతో ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.


Click it and Unblock the Notifications











