నయనతార క్రిష్టియన్ కావటంతో నో ఎంట్రి
నయనతార,ప్రభుదేవా కలిసి రీసెంట్ గా కేరళలోని శ్రీకృష్ణ దేవాలయం ఉన్న గురువాయ్యూర్ వెళ్ళారు. అయితే ఆ గుళ్ళోకి కేవలం హిందువలనే ప్రవేశం అనే నియమం ఉంది. దాంతో క్రిష్టియన్ అయన నయనతార బయిట కార్లో కూర్చుని ఉంది.అలాగే లోపలకి ప్రభుదేవా వెళ్ళి దాదాపు ఇరవై ఐదు నిముషాల సేపు పూజలు చేసి వచ్చారు. ఇదంతా పదమూడవ తేది ఉదయం ఏడు గంటలకు జరిగింది. ప్రభుదేవా తెల్లటి లుంగి పైన కండువా వేసుకుని ఆచార ప్రకారం గుడిలోకి ప్రవేశించి మ్రెక్కు తీర్చుకున్నారు. అక్కడ ప్రధాన పూజారి గిరీశన్ నంబూద్రి ప్రత్యేక పూజ నిర్వహించి ప్రసాదం ఇచ్చారు. ప్రభుదేవా భగవంతుడుకి అరటిపళ్ళని నివేదన చేసారు. ఇద్దరూ ఈ గుడికి వస్తానని మొక్కుకోవటం వల్లే వచ్చారని చెప్తున్నారు. ఇక మీడియా కంటపడకుండా వెంటనే గుడిలోంచి పరుగుపరుగున వచ్చి కారులో ఎక్కి వెళ్ళిపోయారు ఆ జంట. ఇప్పుడా జంట కేరళలోని కొచ్చిలో తాము కొనుక్కున ఇంట్లో ఉన్నారు.


Click it and Unblock the Notifications











