అందులోనూ వేలు పెట్టిన ప్రభుదేవా
కొరియో గ్రాఫర్‌గా ఎంట్రీ ఇచ్చిన ప్రభుదేవా...ఆ తర్వాత నటుడిగా, అనంతరం దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా మరో విభాగంలో కూడా ప్రభుదేవా వేలుపెట్టాడు. సినిమా పాటలకు లిరిక్స్ రాయడం మొదలు పెట్టాడు. ఇటీవల ఓ ప్రెస్ మీట్ లో మ్యూజిక్ కంపోజర్ విజయ్ ఆంటోనీ ఈ విషయాన్ని బయట పెట్టారు. 'వేడి" సినిమాకు గాను ప్రభుదేవ రెండు పాటలకు లిరిక్స్ రాశారని, ఆయన ఒక గొప్ప లిరిసిస్ట్ అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు విజయ్. ఈ సినిమాలో విశాల్, సమీరారెడ్డి లీడ్ రోల్ చేస్తున్నారు.
ఈ సినిమా గురించి ప్రభుదేవా మాట్లాడుతూ...సినిమా యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉంటుందన్నారు. ఈ సినిమాలో విచ్చల విడిగా హాట్ హాట్ లిప్ లాక్ సీన్లు ఉంటాయన్న రూమర్లపై స్పందిస్తూ....మీడియాలో గోరంతను కొండంత చేసిని చూపిస్తున్నారని, ఒక ముద్దు సీన్ సన్నివేశానికి తగిన విధంగా ఉంటుంది, అది సినిమాలో ఓ చిన్న భాగం మాత్రమే అని చెప్పకొచ్చారు. దాన్ని అనవసరంగా పెద్దది చేసి చూపించ వద్దని మీడియాకు సూచించారు.


Click it and Unblock the Notifications











