ప్రభుదేవా,నయనతారల పెళ్ళి రోజు ఫిక్స్

By Srikanya

ప్రేమ జంట నయనతార,ప్రభుదేవాలు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అనే మ్యాటర్ పై మీడియాలో చాలా కాలంగా ఊహాగానాలు జరుగుతన్నాయి.ఈ నేపధ్యంలో ఈ ప్రేమికులు తమ పెళ్ళిని ప్రేమికుల రోజైన పిభ్రవరి 14 న చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.ఈ విషయాన్ని నయనతారకు సన్నిహితుడైన ఓ తమిళ దర్శకుడు చెప్పినట్లుగా తమిళ మీడియా ప్రచారం చేస్తోంది.అంతేగాక..నయనతార కేరళలోని కొచ్చికి సమీపంలో ఉన్న ఓ దీవిలో నయనతార మంచి ఇల్లు కట్టిస్తున్నారని చెప్తున్నారు.పెళ్లి సందర్భంగా ప్రభుదేవాకి ఆమె ఇవ్వబోతున్న కానుక ఇది అని అక్కడ మీడియా చెప్తోంది.ఇక వివాహానంతరం ఈ దంపతులు ముంబయిలో సెటిలవ్వాలనుకుంటున్నారని సమాచారం.ఇక 'శ్రీరామరాజ్యం"తర్వాత నయనతార కొత్త సినిమాలేవీ కమిట్ కాలేదు.ప్రస్తుతం ఆమె ఇంటిపట్టున ఉండి తమ పెళ్లికి కావల్సిన ప్రణాళికలు వేసుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X