»   » కరుణానిధి సమక్షంలో ప్రభుదేవ-నయనతార జంటగా..!

కరుణానిధి సమక్షంలో ప్రభుదేవ-నయనతార జంటగా..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొద్ది నెలలుగా 'సహజీవనం" చేస్తున్న నయనతార-ప్రభుదేవాలు తమిళనాడు ముఖ్యమంత్రి యం. కరుణానిధి సమక్షంలో 'జంట" కాబోతున్నారని సమాచారం అందుతోంది. అంటే వాళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారని కాదు. కరుణానిధికి కోలీవుడ్ తలపెట్టిన సన్మాన కార్యక్రమంలో వీరిరువురూ 'జంట" గా నాట్యం చేస్తున్నారు.

కరుణానిధిని అత్యంత ఘనంగా సన్మానించుకునేందుకు ఈ నెల 5 మరియు 6 తేదీలలో షూటింగ్ లు సైతం స్వచ్చందంగా బంద్ చేసుకున్న కోలీవుడ్. ఈ సన్మాన కార్యక్రమంలో భాగంగా కొన్ని ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేసింది. కమల్ హాసన్ అంతటివాడే ఓ ప్రత్యేక ప్రదర్శన ఇస్తున్నాడు. ఈ నెపధ్యంలో ఆహుతులను అలరించేందుకు నయనతార కూడా నడుంకడుతూ తన ప్రియుడు సహకారం కోరిందని అందుకు ప్రభుదేవా సంతోషంగా అంగీకరించాడని తెలుస్తోంది.

నయనతార, ప్రభుదేవాలు కరుణానిధి సమక్షంలోనే తమ నాట్య ప్రదర్శనతో తమ బందాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని చాలా కుతూహలంగా వున్నారని తెలుస్తోంది. అయితే ప్రభుదేవా భార్య రామ్ లత్ విజ్ఝప్తి మేరకు తమిళనాడులోని మహిళాసంఘాలన్నీ నయనతారను తమ చిత్రాల్లో నటించనివ్వొద్దంటూ అందరు హీరోలు, దర్శకులు, నిర్మాతలకు పిలుపునిచ్చాయి. మరి ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి సమక్షంలోనే తన బంధాన్ని దడం చేసుకోవాలని ఉబలాటపడుతున్న నయనతార కోరిక ఏమేరకు నెరవేరుతుందో చూడాలి!

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu