రెండేళ్ల తర్వాతే అని ప్రభుదేవా తేల్చి చెప్పాడు
చెన్నై : మరికొంతకాలం దక్షిణాదికి దూరంగానే ఉంటానని అంటున్నాడు ప్రభుదేవా. అదిరిపోయే డాన్స్ లతో ఇండియన్ మైఖేల్ జాక్సన్‌గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా ఆపై నటుడిగానూ నిరూపించుకున్నాడు. ప్రస్తుతం మెగాఫోన్ పట్టుకుని విశేషంగా రాణిస్తున్నాడు. తమిళంలో 'పోక్కిరి'లాంటి అద్భుత విజయాన్ని అందించిన ఆయన్ను 'విల్లు', 'ఎంగేయుం కాదల్' నిరాశ పర్చాయి. బాలీవుడ్‌లో మాత్రం ఆయన పేరు మార్మోగిపోతోంది.
ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్‌ఖాన్ ప్రధానపాత్రధారిగా రూపొందిన 'వాంటెడ్', అక్షయ్‌కుమార్ 'రౌడీ రాథోడ్'లు రూ.100 కోట్లకు పైగా వసూళ్ల సాధించాయి. ప్రస్తుతం 'నువ్వొస్తానంటే నేనొద్దాంటానా'కు పునర్నిర్మాణంగా 'రామయ్యా వస్తావయ్యా' రూపొందిస్తున్నాడు. కొత్త కథానాయకుడి సరసన శ్రుతిహాసన్ ఆడిపాడుతోంది.
ప్రభుదేవా మాట్లాడుతూ.. హిందీలో నా తొలి రెండు చిత్రాలు ఘన విజయాలు సాధించినా అవి సొంత స్క్రిప్ట్‌లు కావు. సొంత స్క్రిప్ట్‌తో రూపొందిస్తున్న 'రామయ్యా వస్తావయ్యా'ను కూడా హిట్ చేయాలనే తపనతో ఉన్నాను. బాలీవుడ్‌లో వరుస అవకాశాలు వస్తున్నాయి. వాటిని అంగీకరించేందుకేమొగ్గు చూపుతున్నాను. మరో రెండేళ్లు ఇక్కడే ఉండాలనే ఆలోచనకు వచ్చాను. అప్పటివరకు దక్షిణాదికి వచ్చే అవకాశాలైతే లేవు. ఆ తర్వాత సొంత భాషలోనూ మంచి సినిమాలు అందిస్తానని వివరించాడు.


Click it and Unblock the Notifications












