ప్రకాష్ ఝా దర్శకత్వంలో ‘కో’ రీమేక్...!
తెలుగు సినిమాలతో బాటు తమిళ సినిమాలకు కూడా బాలీవుడ్ రీమేక్ రైట్స్ బాగా పలుకుతున్నాయి. దక్షిణాది చిత్రాలు ఇటీవలి కాలంలో కొత్తతరహాలో సాగుతూ సక్సెస్ అవుతుండడంతో బాలీవుడ్ పెద్ద మొత్తంలో రీమేక్ రైట్స్ ఆఫర్ చేస్తోంది. తాజాగా అలా ఓ తమిళ, తెలుగు సినిమా జాక్ పాట్ కొట్టింది. జీవా, కార్తీక జంటగా కెవి ఆనంద్ రూపొందించిన 'రంగం' (తమిళంలో 'కో') హిందీ రీమేక్ హక్కులు కోటి ఏభై లక్షలకు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది.
ఆమధ్య 'గజని' సినిమా తర్వాత దీనికే పెద్ద రేటు వచ్చిందని వ్యాపార వర్గాలు అంటున్నాయి. రాజనీతి ఫిల్మిం మేకర్ హిందీలో ఈ చిత్రాన్ని హిందీలో రూపొందనించనున్నారు. కి ప్రకాష్ ఝా దర్శకత్వం వహిస్తున్నాడు. హిందీ వెర్షన్లో రణబీర్ కపూర్ హీరోగా నటించే అవకాశం వుంది. అతనిని ఒప్పించే బాధ్యతను ప్రకాష్ ఝా తీసుకున్నాడట..!


Click it and Unblock the Notifications











