ప్రకాష్ రాజుకి మరో ట్విస్టు!!

అయితే సభా వెర్షన్ ప్రకారం ప్రకాష్ రాజ్ కి మొదట కధ వినిపించటం నిజమేనని అయితే ఫైనాన్సియల్ కారణాలతో ఆయన సినిమా చేయలేదని దాంతో మరో నిర్మాత ని వెతుక్కున్నాని చెప్తున్నాడు. ఇందులో తప్పేముందని వాదిస్తున్నాడు. అయితే ప్రకాష్ రాజ్ మాత్రం ఎగ్రిమెంట్ జరిగాక ఇలా నిర్మాతని చెప్పాపెట్టకుండా మార్చచ్చా అని ప్రశ్నిస్తున్నాడు. అయితే ఈ విషయమై నిర్మాతల మండలి ఇప్పటి వరకూ నోరు విప్పలేదు. గతంలో ప్రకాష్ రాజ్ ఇలాంటి తలనొప్పులే ఇతర నిర్మాతలకు తెచ్చేవాడని ...ఇప్పుడు ఆయన నిర్మాతగా మారాక తన దాకా వచ్చాక ఆ భాధ అర్ధమవుతోందని బయిట వారు ఘాటుగా విమర్శిస్తున్నారు.


Click it and Unblock the Notifications











