twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రకాష్ రాజ్‌కు తమిళ సెగ.. కోలీవుడ్ నుంచి బ్యాన్ చేయాలంటూ డిమాండ్, ఏం జరిగిందంటే...?

    |

    Recommended Video

    Prakash Raj Clarification On Anti-Tamil Comments Issue || Filmibeat Telugu

    ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్‌కు తమిళుల సెగ తగిలింది. అతడు తమిళులకు సంబంధించిన ఓ విషయంలో వ్యతిరకంగా ఉన్నారనే రూమర్స్ స్ప్రెడ్ అవ్వడమే ఇందుకు కారణం. ఈ వివాదం తీవ్రం అవ్వడంతో పాటు ప్రకాష్ రాజ్‌పై కోలీవుడ్ బ్యాన్ విధించాలనే డిమాండ్ సైతం తెరపైకి వచ్చింది. అయితే వెంటనే ఈ వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేశాడు ఈ బహుభాషా నటుడు.

    తమిళ మీడియా కథనాల ప్రకారం... ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తమిళ విద్యార్థులను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ యూనివర్శిటీలో దాదాపు 500 మంది తమిళనాడుకు చెందిన విద్యార్థులు చదువుతున్నారని, వారి మూలంగా ఢిల్లీ వారికి అవకాశం లేకుండా పోతోందని...తాను మళ్లీ అధికారంలోకి వస్తే ఈ పరిస్థితుల్లో మార్పు తెస్తానని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.

    తాను తమిళుడిని కాదని ప్రకాష్ రాజ్ చెప్పారంటూ...

    తాను తమిళుడిని కాదని ప్రకాష్ రాజ్ చెప్పారంటూ...

    అయితే అరవింద్ కేజ్రీ‌వాల్‌కు మద్దతుగా ఢిల్లీలో ప్రచారం చేస్తున్న ప్రకాష్ రాజ్.... కేజ్రీవాల్ తమిళుల విషయంలో చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా ఉన్నట్లు ప్రచారం జరిగింది. అంతే కాదు... పలు తమిళ చిత్రాల్లో నటించిన ప్రకాష్ రాజ్ తాను తమిళనాడుకు చెందిన వ్యక్తిని కాదని, కర్నాటకవాసిని అని ప్రచారంలో చెప్పినట్లు ఆరోపణలు వెళ్లువెత్తాయి.

    తమిళ సినీ పరిశ్రమ నుంచి బ్యాన్ చేయాలంటూ డిమాండ్

    తమిళ సినీ పరిశ్రమ నుంచి బ్యాన్ చేయాలంటూ డిమాండ్

    ప్రకాష్ రాజ్‌ను ఈ విషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి కె పళనిస్వామితో పాటు పలువురు బీజేపీ లీడర్లు, ఇతర పొలిటిషియన్స్ ఖండించారు. తమిళ సినిమాల్లో నటిస్తూ ఎన్నో మంచి అవకాశాలు దక్కించుుకున్న ప్రకాష్ రాజ్ ఇలా మాట్లాడిన విషయం తెలిసి నెటిజన్లు ఆయనపై దాడి చేయడం ప్రారంభించారు. క్షమాపణలు చెప్పాలని, లేనిచో తమిళ సినీ పరిశ్రమ నుంచి అతడిని బహిష్కరించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది.

    రంగంలోకి నిర్మాత ధనుంజయ్

    రంగంలోకి నిర్మాత ధనుంజయ్

    అయితే ఈ వివాదంలో ప్రకాష్ రాజ్‌ను కాపాడేందుకు తమిళ నిర్మాత ధనుంజయన్ రంగంలోకి దిగారు. ‘‘ప్రకాష్ రాజ్ సర్.. నేను విన్నది నిజమా? మీరు అలా మాట్లాడారా? ఇది నిజం కాదని నేను నమ్ముతున్నాను. మీ వ్యాఖ్యలను ఎవరో వక్రీకరించారని భావిస్తున్నాను. ఇండియాలో విద్యార్థులు ఎవరు ఎక్కడైనా చదువుకోవచ్చు. ఈ విషయంలో ఆంక్షలు విధించే హక్కు ఎవరికీ లేదు. నేను ముంబైలో చదువుకున్నాను. మీరు ఇలా మాట్లాడి ఉండరని బావిస్తున్నాను'' అంటూ ట్వీట్ చేశారు.

    ఇలా దిగజారినందుకు సిగ్గుగా ఉంది

    ధనుంజయన్ ట్వీట్‌పై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ... ‘‘ధనుంజయ్... మీరు నాపై నమ్మకం పెట్టుకున్నందుకు థాంక్స్. నేను అసలు అలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఎవరో కావాలనే నా గురించి ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కొందరు వ్యక్తులు మరీ ఇంతలా దిగజారిపోయినందుకు సిగ్గుగా ఉంది' అంటూ ప్రకాష్ రాజ్ వివరణ ఇచ్చారు.

    English summary
    Actor Prakash Raj explains his remark on Tamil Students in Delhi AAP campaign. "I NEVER SAID THAT. .. it’s DELIBERATELY MISQUOTED WITH BAD INTENTIONS.. SHAME on those who stoop to this level." Prakash Raj tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X