ప్రకాష్ రాజ్ కి అల్లు అరవింద్ వార్నింగ్

By Srikanya

అల్లు అరవింద్ చిన్న కొడుకు అల్లు శిరీష్ త్వరలో గౌవరం చిత్రం ద్వారా లాంచ్ అవుతున్న సంగతి తెలిసిందే. మొదట నాగచైతన్య హీరోగా అనుకున్న ఈ సబ్జెక్టు చేతులు మారి ఇప్పుడు అల్లు శిరీష్ చేతికి దక్కింది. రాధామోహన్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని ప్రకాష్ రాజ్ నిర్మిస్తున్నారు. ఆయన తన డ్యూయిట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. మొదట అల్లు అరవింద్ అక్కడ ఓ పెద్ద బ్యానర్ సాయింతో తన కొడుకుని లాంచ్ చేద్దామమనుకున్నారు కానీ,రాధా మోహన్ కి, ప్రకాష్ రాజ్ కి ఉన్న అనుభంధం నేపధ్యంలో ఈ ప్రాజెక్టుని ప్రకాష్ రాజ్ కి అప్పచెప్పారు.

ఇక మొదటి నుంచి ప్రకాష్ రాజ్ ...రాధా మోహన్ ని ఎంకరేజ్ చేస్తు వస్తున్నారు. మొన్న గగనం చిత్రాన్నికూడా తమిళంలో ఆయనే నిర్మించారు. ఆ తర్వాత రాధామోహన్ డైరక్ట్ చేసిన అబినయనానుమ్ చిత్రం కన్నడ వెర్షన్ ని ఆయనే డైరక్ట్ చేసారు కూడా. ఇలా ప్రకాష్ రాజ్ తానే నిర్మిస్తానని ముందుకు రావటంతో అల్లు అరవింద్ వెనక్కి తగ్గారు. అయితే తన కొడుకు లాంచింగ్ మాత్రం ఎట్టి పరిస్ధితుల్లోనూ చాలా గ్రాండ్ గా జరగాలని వార్నింగ్ లాంటిది ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. ఆ మేరకు ప్రకాష్ రాజ్ హామీ ఇచ్చినట్లు వినికిడి.

అంతేగాక పబ్లిసిటీ విషయంలోనూ ఓ భారీ చిత్రానికి చేసినట్లు చేయాలని కూడా చెప్పినట్లు దానికి కూడా ప్రకాష్ రాజ్ తలూపినట్లు తెలుస్తోంది. ఇవన్నీచూస్తుంటే ప్రకాష్ రాజ్ ..ఈ సారి భారీ బడ్జెట్ తో ఈ చిత్రం నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది మరో విషయం ఏమిటంటే ..నాగార్జున ఈ చిత్రాన్ని బడ్జెట్ బాగా ఎక్కువుతుందనే వెరసి తన కుమారుడుతో నో చెప్పినట్లు తెలుస్తోంది.

ఇక అల్లు శిరీష్ విషయానికి వస్తే...15 సినిమాలు తమిళంలో చేసిన తర్వాత గానీ తెలుగులో నటించనని అల్లు శిరీష్ శపథం పూనాడు కూడా. ఈ విషయాన్ని అల్లు అరవింద్ స్వయంగా వెల్లడించారు. ఆ మధ్యన ప్రముఖ దర్శకుడు, గజనీ ఫేం మురుగదాస్ దర్శకత్వంలో శిరీష్ నటించనున్నాడని వార్తలు కూడా వచ్చాయి. 'తొట్టాల్ పూ మాలరుమ్' అనే టైటిల్ తో ఈ సినిమా రూపొందుతోందని, తొట్టాల్ పూ మాలరుమ్ అంటే ముట్టుకుంటే పువ్వు విచ్చుకుంటుందని అర్థమని చెప్పారు. తమిళ సీనియర్ నటుడు ఎంజీఆర్ కు సంబంధించి పాపులర్ పాటలోని లిరిక్ ఆధారంగా ఈ టైటిల్ ను పెట్టారవని ప్రచారం జరిగింది.

తమిళంలో హీరోగా తనను తాను నిరూపించుకునేందుకు అల్లు శిరీష్ ఇప్పటికే చాలా కష్ట పడుతున్నాడు. బాగా ఒళ్లు తగ్గించుకుని స్లిమ్ గా, స్టయిలిష్ గా తయారవ్వడమే కాకుండా, నటన, ఫైట్స్, డాన్స్ విషయంలో ముంబై వెళ్లి నిపుణుల సమక్షంలో ట్రైనింగ్ తీసుకుని వచ్చాడు. ఇప్పుడతని లుక్ చూసిన వారు చాలా ఆశ్చర్యపోతున్నారు. అతను గ్యారెంటీగా తమిళంలో నిలదొక్కుకుంటాడని చెప్తున్నారు. అటు రామ్ చరణ్...హిందీలో జంజీర్ తో ఎంట్రీ ఇస్తూంటే ఇటు అల్లు శిరీష్ ఇలా తమిళంలో లాంచ్ అవుతున్నాడు. మరో ప్రక్క అల్లు అర్జున్ ఇప్పటికే కేరళ మార్కెట్ లో మంచి పేరు సంపాదించుకున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X