స్టార్ హీరోని కూడా పట్టించుకోవటం లేదు...ప్రకాష్ రాజ్ కామెంట్
తమ అభిమాన హీరో నటించిన సినిమా అయినా పట్టించుకోవట్లేదు.స్టార్ అన్నా ధియోటర్స్ కి రావటం లేదు. రొటీన్ కథల్ని పక్కకి తోసేస్తున్నారు. ప్రేక్షకుల దృక్పతంలో మార్పు వచ్చింది అంటున్నారు ప్రకాష్ రాజ్. ఆయన తమిళంలో నటించి, నిర్మించిన పయినం(తెలుగులో గగనం) చిత్రం గురించి మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే పరిశ్రమలో విజయాల శాతం చూడండి...ఎంత తక్కువగా ఉందో. రోజూ ఎన్ని పనులున్నా సినిమా చూడాల్సిందేనని అనుకోవటం లేదు. నచ్చితేనే చూస్తారు. లేదంటే లేదు అని విశ్లేషించారు.
ఇక తన కెరీర్ గురించి చెబుతూ..మొనాటమీ నుంచీ బయటపడటానికి ప్రయత్నిస్తున్నా. మంచి సినిమాల కోసం ప్రయత్నిస్తున్నా. అలాంటి చేసినప్పుడే ఓ 'కాంజీవరం', ఓ 'ఆకాశమంత', ఓ 'గగనం' లభిస్తాయి. కొత్త కథల కోసం ప్రయత్నాలు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి. ప్రేక్షకులూ దానికోసమే ఎదురుచూస్తున్నారు. 'హ్యాపీడేస్' అలానే ఆదరించారు. ఈమధ్య వచ్చిన 'అలామొదలైంది' సినిమా కూడా బాగా క్లిక్ అయింది. ప్రయత్నం లోపం లేకుండా ప్రయోగం చేస్తే ఫలితాలొస్తాయి అన్నారు.


Click it and Unblock the Notifications











