ప్రభుదేవాకి ట్విస్ట్ ఇచ్చిన ప్రకాష్ రాజ్

ఆ సినిమాలో ఆయన చాలా కీలకమైన రోలు. దాదాపు నెగిటివ్ షేడ్స్ ఉండే ఈ పాత్రతో విజయ్ తలపడే సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉండగా సెల్ కూడా కట్టేసి అందుబాటులో లేకుండా పోయాడు. దాదాపు రెండు వందల యాభై మంది జూనియర్ ఆర్టిస్ట్,ఫైటర్స్,యూనిట్ మెంబర్స్ అంతా పనికి ఇబ్బంది కలిగించాడని ఆడిపోసుకుంటున్నారు.
పోనీ ముందు చెప్పినా ఇంత ఇబ్బంది వచ్చేది కాదని ప్రభుదేవా గొల్లుమన్నాడుట. అప్పటికీ నిర్మాత,హీరో ప్రకాష్ రాజ్ ని కాదన్నా పట్టుబట్టి ఒప్పించినందుకు ఇలా చేసాడని చాలా సీరియస్ అయ్యాడు. ఇక ఈ రోజు(శుక్రవారం)నుంచే ఆయన లైన్ లోకి వచ్చాడు. అమ్మయ్య అనుకుని షూటింగ్ ప్రారంభించారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా నయనతార నటిస్తూంటే,దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











