విడాకులతో హీరో హ్యాపీ

By Staff

Prashanth
హీరో ప్రశాంత్ కి విడాకులు పొందారు. తన భార్య గృహలక్ష్మికి తనతో కన్నా ముందే వేరే వ్యక్తితో పెళ్ళయిందనే ప్రశాంత్ వాదనను కోర్టు నమ్ముతూ విడాకులు మంజూరు చేసింది. చెన్నై ఫ్యామిలీ కోర్టు జడ్జి పి.రామలింగన్ ఈ విషయంపై తీర్పు చెప్పారు. అయితే వారికి పుట్టిన బిడ్డను మాత్ర తల్లితోనే ఉండాల జడ్జిమెంట్ ఇవ్వటం ప్రశాంత్ ని ఆందోళనకు గురిచేసింది. ఈ విషయాన్ని ప్రశాంత్ అతని తండ్రి త్యాగరాజన్ తమిళ మీడియాతో చెప్పారు.

చెన్నైలో విలేకరులతో మాట్లాడిన ప్రశాంత్ గృహలక్ష్మితో కలసి జీవించాలనుకుంటున్నప్పటికీ, తనకు అందిన సమాచారంతో ఆమెకు ముందుగా వివాహమైన సంగతి తెలిసిందన్నాడు. 1998లో నారాయణన్ వేణు ప్రసాద్‌తో ఆమెకు వివాహమైనట్టు తన వద్ద రిజిష్టర్ దస్తావేజు సాక్ష్యాధారం ఉందన్నాడు. ఆమెకు అప్పటికే వివాహమైన విషయాన్ని దాచి పెట్టి మరీ తనతో ఆమెకు పెళ్లి చేశారని అతను ఫిర్యాదు చేశానని చెప్పాడు. ఇక మధ్రాస్ ఫ్యామిలీ కోర్టు ఈ తీర్పు ఇచ్చింది.

అలాగే ఫ్రశాంత్ ఇంతకు ముందు కూడా మీడియా మీట్ లో తానతో విడాకులు ఇచ్చేందుకు రూ. 50 కోట్లు కావాలని గృహలక్ష్మి తరపున తనను డిమాండ్ చేస్తున్నారని ఆరోపించాడు. ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని అప్పుడు వెల్లడించాడు.అలాగే చాలామంది విడాకుల వ్యవహారాన్ని బ్లాక్ మెయిల్స్ వంటి వాటికి వినియోగిస్తూ తప్పులు చేస్తున్నారని చట్టంలో దీనిపై స్ట్రిక్టు గా మార్పులు తేవాల్సిన అవసముందన్నారు. ఇక తన బిడ్డ విషయమై ప్రశాంత్ మాట్లాడుతూ గృహలక్ష్మి కుటుంబానికి కల్చర్ అనేది లేదని,రోజంగా క్లబ్ లు ,పబ్ లు అంటూ గడపుతారని, అటువంటి చోట పెరిగితే తన బిడ్డకు ఇబ్బంది అన్నారు. ఈ విషయమై మళ్లీ కోర్టుకెళతానన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X