twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బర్త్ డే గిఫ్ట్: థమన్‌కు ఖరీదైన కారు కొనిచ్చిన హీరో

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: సంగీత దర్శకుడు థమన్ హీరో ప్రశాంత్ నుండి ఖరీదైన గిఫ్టు అందుకున్నాడు. ప్రశాంత్ హీరోగా తెరకెక్కుతున్న సాహసం అనే తమిళ చిత్రానికి అద్భుతమైన మ్యూజిక్ అందించావంటూ చిత్ర యూనిట్ అతనిపై ప్రశంసల వర్షం కురిపించింది. దీంతో పాటు ఆయనకు పుట్టినరోజు గిఫ్టుగా రూ. 25 లక్షల విలువ చేసే టయోటా ఫార్చూనర్ కారు అందించారు.

    ‘సాహసం' చిత్రానికి అరున్ రాజ్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో హిట్టయిన ‘జులాయి' చిత్రానికి ఇది రీమేక్. ఈ చిత్రాన్ని స్వయంగా ప్రశాంత్ తండ్రి త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రశాంత్ సరసన తమన్నా నటిస్తోంది. అల్లు అర్జున్ పోషించిన పాత్రను ప్రశాంత్ చేస్తున్నాడు.

    స్లైడ్ షోలో ఫోటోలు...

    కేక్ కట్ చేస్తున్న తమన్

    కేక్ కట్ చేస్తున్న తమన్

    సాహసం అనే తమిళ చిత్రం యూనిట్ సమక్షంలో కేక్ కట్ చేస్తున్న థమన్.

    షాంపేన్ పొంగిస్తూ...

    షాంపేన్ పొంగిస్తూ...

    చిత్ర యూనిట్ సభ్యులంతా కలిసి తన పుట్టినరోజు వేడుక జరుపడం, కారు గిఫ్టుగా ఇవ్వడంపై థమన్ సంతోషం వ్యక్తం చేసారు.

    టయోటా కారు

    టయోటా కారు

    చిత్ర నిర్మాత నుండి టయోటా ఫార్చూనర్ కారును గిఫ్టుగా అందుకుంటున్న తమన్

    థమన్

    థమన్

    థమన్ నవంబర్ 16వ తేదీతో 31వ వసంతంలోకి అడుగు పెట్టారు.

    English summary
    Osthe music director (Thaman) celebrated his 31st birthday recently, and the team Sahasam gifted him a Toyota Fortuner car as a gift for his tremendous work.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X