ఫ్లాఫ్ అయితేనేం 'ప్రస్ధానం' చిత్రానికి బాగానే కలిసివస్తోంది
సాయికుమార్,శర్వానంద్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ప్రస్ధానం చిత్రం భాక్సాపీస్ వద్ద పరాజయం పొందినా తమిళ రీమేక్ రైట్స్ బాగానే పోయినట్లు సమాచారం. ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టు ప్రకాష్ రాజ్ ఈ చిత్రంలోని సాయికుమార్ పాత్రను చూసి ప్రేరణ పొంది తాను చేయతగ్గ పాత్ర అని వెంటనే రైట్స్ తీసుకున్నారు. ఆయన సొంత బ్యానర్ డ్యూయిట్ ఫిల్మ్స్ పై దీనిని రీమేక్ చేయాలని సంకల్పిస్తున్నారు. ఇక దిల్ రాజు కూడా ఈ ప్రాజెక్టులో పాలుపంచుకునే అవకాశమున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రం తమిళ వెర్షన్ ను దర్శకుడు దేవకట్టానే చేస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఇక తమిళంలో ఇలాంటి ఆఫ్ బీట్ తరహా సినిమాలకు ఆదరణ బాగా ఉండటంతో ఈ చిత్రం రైట్స్ తీసుకున్నట్లు చెప్తున్నారు. మొత్తానికి దేవకట్టా పెట్టిన కృషి ఈ రూపంలో సార్ధకమైందన్నమాట. ఇక ప్రయోగాత్మకంగా తీసిన వేదం కూడా తమిళంలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. మరోప్రక్క మగధీర చిత్రం భారీ ప్రింట్లతో తమిళంలో డబ్బింగై రిలీజవుతోంది. ప్రస్తుతం ప్రకాష్ రాజ్..తన దర్శకుడు రాధామోహన్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా, దిల్ రాజుతో కలిసి గగనం చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











