తమిళ వర్థమాన నటుడు ప్రవీణ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం రాత్రి తన నివాసంలో ప్రవీణ్ కుమార్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 26 ఏళ్ల వయసున్న ప్రవీణ్ కుమార్, 36 ఏళ్ల తన భార్య నిషాతో గొడవల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిషాకు ఇంతకు ముందే పెళ్లయి ఎనిమిదేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. మొదటి భర్తతో విడిపోయిన తర్వాత నిషా, ప్రవీణ్ తో కలిసి ఉంటోంది. ఇంతకుముందు బిపిఓ కంపెనీలో పనిచేసిన ప్రవీణ్ కుమార్ సినిమాల్లో నటించడం కోసం ఆ ఉద్యోగం వదిలేశాడు. ఇటీవలే మాధవన్ హీరోగా నటించిన ఆర్య సినిమాలో సెకండ్ హీరోగా ప్రవీణ్ కుమార్ నటించాడు.