తమిళ హీరో మరణానికి నిషా కారణం కాదు

By Staff

తమిళ వర్థమాన హీరో ప్రవీణ్ కుమార్ ఆత్మహత్యకు నిషా ఎంతమాత్రం కాదని ఆమె మాజీ భర్త ఇలాంగో చెబుతున్నాడు. పోలీసులకు ఇచ్చిన స్టేట్ మెంట్ లో ఇదే చెప్పాడు. ఆర్య సినిమాలో మాధవన్ స్నేహితునిగా నటించిన ప్రవీణ్ ఆదివారం రోజు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రవీణ్ ఆత్మహత్యకు నిషాయే కారణమంటూ తల్లి గీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మంగళవారంనాడు నిషా పోలీసులకు లొంగిపోయింది. ప్రవీణ్ మరణానికి ఆయన తల్లే కారణమంటూ నిషా పేర్కొంది. ఇలా ఉండగా ఈ హత్య జరిగిన రోజు నిషా మాజీ భర్త ఇలాంగో శబరిమలలో ఉన్నాడు. బుధవారం చెన్నయ్ తిరిగివచ్చిన ఇలాంగో పోలీసులకు తన స్టేట్ మెంట్ ను ఇచ్చాడు....నేను కాలేజీలో చదువుకునేప్పుడు నిషా ప్రేమలో పడ్డాను..పెళ్లి చేసుకున్నాను...8 ఏళ్ల పాటు సాలిగ్రామంలో నివసించాం..నిషా మిత్రుడైన ప్రవీణ్ నెమ్మదిగా నిషా ప్రేమలో పడ్డాడు..అందుకే మా మధ్య విబేదాలు వచ్చాయి...నా కొడుకు నాకు ఎంతో ముఖ్యం..నా కొడుక్కు తల్లి ఎంతో అవసరం...అందుకే దూరంగా ఉండమన్నాను...అందుకు స్పందించిన ప్రవీణ్..నీకు కొడుకు ఎంత ముఖ్యమో నాకు నిషా అంత ముఖ్యమన్నాడు..దాంతో మార్చి 3న విడాకుల కోసం దరఖాస్తు చేశాం...విడాకులు మంజూరు కాకముందే వారు పెళ్లి చేసుకున్నారు...విడాకులు సెప్టెంబర్ లో మంజూరయ్యాయి...నిషాకు కొడుకు అభిషేక్ అంటే ఎంతో ఇష్టం...అందుకే విడాకులు మంజూరయిన తరువాత కూడా నా ఇంట్లోనే ఉంటోంది...ఎపుడైనా నా ఇంటికి ప్రవీణ్ వస్తే నా కెరీర్ కు నా తల్లి గీతా అడ్డుగా తయారయిందని చెబుతుండేవాడు...ప్రవీణ్ తల్లి గీత ప్రవీణ్ సోదరి విష్ణుప్రియను సినిమాలలో డాన్సర్ ను చేసేందుకు పేరును నమోదు చేయడానికి ప్రయత్నించింది...దీనిని ప్రవీణ్ తీవ్రంగా వ్యతిరేకించాడు..నా మాట ఎవరూ వినడంలేదని పలుమార్లు నిరుత్సాహానికి గురయ్యేవాడు..అందుకే ఆయన ఆత్మహత్యకు నిషా ఎంతమాత్రం కారణం కాదని చెబుతున్నాను...నిషానే ఇపుడు ఒక అనాథ అయింది...అన్నాడు నిషా మాజీ భర్త ఇలాంగో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X