పథకం ప్రకారమే ఫ్లాఫ్ అని ప్రచారం!

ఈ విషయం నిమిత్తమే నిర్మాత అయిన పుష్ప కందస్వామి(కె.బాలచందర్ కుమార్తె) నిన్నో ప్రెస్ మీట్ పెట్టారు.అక్కడ ఆమె చెప్పిన దాని ప్రకారం కుశేలన్ సినిమా మంచి ఫీల్ గుడ్ సినిమా. క్లీన్ ఎంటర్ టైన్ మెంట్ గా వచ్చిన ఈ సినిమాలో సెంటిమెంట్ కూడా అంతర్గతంగా ఉండటం అందరికీ నచ్చుతోంది. ఫ్యామిలీలు కి అందులో ముఖ్యంగా మహిళలకు ఈ సినిమా బాగా పడుతోంది. అయితే రిలీజైన 20 రోజుల లోపే ట్రేడ్ ఎనాలిసిస్ట్ లంతా దీన్ని ఏ కోణంలో చూసారో ఏమో నెగిటవ్ టాక్ తేవటం ప్రారంభించారు. అయితే ఇదంతా ప్రీ ప్లాన్ డ్ కుట్ర అని విషయాన్ని అర్ధం చేసుకున్న వారికి తెలుస్తుది. అలాగే థియోటర్స్ నుండి తీసివేయటాన్ని ఆమె ఖండిస్తోంది.అలాంటిదేమీ జరగలేదని వాదిస్తోంది.
అసలు ఇదంతా ఎవరూ ఊహించని రీతిలో ఒక్కసారిగా సినిమా కలెక్షన్స్ పడిపోవంటంతో ప్రారంభమయింది. అలాగే రజనీకాంత్ మ్యాజిక్ కూడా కథా లేమి ముందు తేలిపోయింది. దాంతో సినిమా ఎగ్జిబీటర్లు అంతా తిరిగి తాము లాస్ అయి పోయిన మొత్తాన్ని రిఫెండ్ చేయమని గొడవ చేస్తున్నారు. దాంతో ఏం చేయాలో తోచని నిర్మాత ( ప్రముఖ దర్శకుడు బాలచందర్) కుమార్తె పుష్ప కందస్వామి ఈ విధంగా స్టెట్ మెంట్స్ ఇస్తోందని చెన్నై సినీ వాసులు అంటున్నారు.


Click it and Unblock the Notifications











