Don't Miss!
- News కేజ్రివాల్, కవిత కస్టడీపై ఢిల్లీ కోర్టు కీలక నిర్ణయం..!
- Sports CSKకి కొత్త సమస్య.. ప్లేఆఫ్స్ చేరాలంటే ఎలా?
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అల్లు అరవింద్ రైట్స్ తీసుకుని రీమేక్ చేస్తున్నాడు
చెన్నై: ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మార్కెట్ లో ఏది నిలబడుతుందో..ఏ కథ చేస్తే హిట్టవుతుందో, ఏ రీమేక్ జనాలను ఆకట్టుకుంటుందో తెలిసిన నిర్మాత. ఆయన కన్ను ప్రస్తుతం ప్రభాకర్‌రెడ్డి దర్శకత్వంలో సుధీర్ బాబు, నందిత ముఖ్య తారాగణంలో తెలుగులో రూపొందిన చిత్రం 'ప్రేమ కథా చిత్రమ్' పై పడింది. గత ఏడాది జూన్‌లో విడుదలై విజయవంతమైన ఈ చిత్రాన్ని తమిళంలో 'డార్లింగ్' పేరుతో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనిని గీతా ఆర్ట్స్, స్టుడియో గ్రీన్ సంయుక్తంగా నిర్మించనున్నాయి.
ఇందులో సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ హీరోగా, అతడి సరసన నిక్కి గల్‌రాణి నటించనున్నారు. 'వెయిల్' చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయమైన జీవీ ప్రకాష్ ఇప్పటికే 'పెన్సిల్', 'త్రిష ఇల్లె నయన్‌తారా' చిత్రాల్లో హీరోగా నటిస్తున్నారు.'డార్లింగ్' జీవీ ప్రకాష్‌కు హీరోగా మూడో చిత్రం.
'ఒరు కాదల్ సెయ్‌వీర్' చిత్రం ద్వారా పరిచయమైన నటి సంజనకు నిక్కి గల్‌రాణి సహోదరి. ఆమె ఇప్పటికే మలయాళం, కన్నడ చిత్రాల్లో నటించారు. ఈ చిత్రం అక్కడా మంచి విజయం సాధిస్తుందని భావిస్తున్నారు. అక్కడ కూడా హర్రర్ కామెడీ జానర్ చిత్రాలు హిట్ అవుతున్న నేపధ్యంలో బిజినెస్ సైతం బాగా జరుగుతుందని భావిస్తున్నారు.