Don't Miss!
- News కేసీఆర్ భరోసా: 22 నుంచి బస్సు యాత్రతో జనంలోకి
- Sports భార్య పేరు చెప్పి.. DK నోరు మూయించిన కోహ్లి Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ప్రేమిస్తే సంధ్య 'హాసిని'గా
బి.వి.రమణారెడ్డి దర్శకత్వంలో బి.కమలాకర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం హైద్రాబాద్ లోని అన్నపూర్ణా స్టూడియోస్ లో ప్రారంభమైంది. ఈ సినిమాలో కమలాకర్('అభి' ఫేమ్), సంధ్య('ప్రేమిస్తే' ఫేమ్) జంటగా 'హాసిని' చిత్రం రూపొందుతోంది. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తం సన్నివేశానికి రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి క్లాప్ ఇవ్వగా, వై.వి.సుబ్బారెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు.
ఈ చిత్రానికి సంధ్య అయితేనే హీరోయిన్ గా బాగుంటుందని ఆమెను ఎంపిక చేశారని, సంగీత దర్శకుడుగా తనకు పేరు వస్తుందనీ కోటి వెల్లడించారు. ఇదొక ప్రేమ కథా చిత్రమనీ, వినోదం, సెంటిమెంట్ మేళవించి ఉంటుందనీ దర్శకుడు రమణారెడ్డి తెలిపారు. గురువారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించామనీ, కేరళ, వైజాగ్, మారిషస్ లో పాటల చిత్రీకరణ జరుపుతామనీ చెప్పారు. మాటల రచయిత మరుధూరి రాజా మాట్లాడుతూ, ఈ చిత్రం స్క్రిప్టు కోసం ఎక్కువ రోజులు పనిచేశాననీ, డైరెక్టర్ కు మంచిపేరు తెచ్చే చిత్రమవుతుందనీ అన్నారు. ఎక్కడా నెగిటివ్ అంశాలు లేని కథా చిత్రమిదని హీరో కమలాకర్ తెలిపారు. ప్రధానంగా హాసిని చుట్టూ కథ నడుస్తుందన్నారు. తెలుగులో మంచి కథ చిత్రం కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ఈ అవకాశం వచ్చిందని సంధ్య పేర్కొంది. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో గిరిబాబు, ధర్మవరపు సుబ్రమణ్యం, ఆహుతి ప్రసాద్, కృష్ణ భగవాన్, ఆలీ, వేణుమాధవ్, పృధ్వీ, శ్రీనివాసరెడ్డి, సురేఖా వాణి, రమ్యశ్రీ నటిస్తున్నారు.