పాప పుట్టింది ..ఫుల్ హ్యాపీ
చెన్నై: తమిళ,మళయాళ చిత్రాల నటుడు హీరో పృథ్వీరాజ్ ...తెలుగు వారికి డబ్బింగ్ చిత్రాల ద్వారా సుపరిచితుడు. ఆయన ఇంట్లో ఇటీవల వరుసపెట్టి సంతోషాలు సందడి చేస్తున్నాయి. ఈ హీరో తాజాగా పుత్రికోత్సాహంతో పులకించిపోతున్నారు. ఆయన భార్య సుప్రియమీనన్ జర్నలిస్ట్. ఆమె గత సోమవారం ఒక ప్రైవేటు ఆసుపత్రిలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.
పృథ్వీ నటించిన తాజా చిత్రం 'సప్తమహర్షి తస్కర్ష' మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయింది. దాంతోపాటు ఓనం సందడి నెలకొన్న పృథ్వీ ఇంట ఇప్పుడు ఆడబిడ్డ పుట్టడంతో ఆనందానికి అవధులు లేకుండా పోయాయట. 'ఇది నాకెంతో ప్రత్యేక సందర్భం. నా సంతోషాన్ని మాటల్లో వర్ణించలేం' అని పృథ్వీ సామాజిక మాధ్యమంళ ఫేస్ బుక్, ట్విట్టర్ లలో పేర్కొన్నారు.



Click it and Unblock the Notifications











