10 ఏళ్లు డేటింగ్.. ప్రియుడితో పెళ్లికి సిద్ధమైన స్టార్ హీరోయిన్‌!

Priya Bhavani Shankar:ఇటీవల కాలంలో పలువురు సార్ట్ హీరోయిన్స్ తమ డైహార్ట్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్ చెబుతున్నారు. తమ ఫ్యాన్స్ ను ఆగం ఆగం చేస్తున్నారు. ఇంతకీ షాకింగ్ అప్టేడ్స్ ఏంటీ? ఫ్యాన్స్ ఆగం ఆగం కావడమేంటీ అనుకుంటున్నారా ? తమకు నచ్చిన, ఇష్టమైనా హీరోయిన్.. ఆ హీరోతో డేటింగ్ తో ఉన్నారు. ఈ హీరోను పెళ్లి చేసుకోబోతుందంటే.. ఆ బ్యూటీ లవ్ బ్రేకప్ అయిందట.. అనే న్యూస్.. డై హార్ట్ ఫ్యాన్స్ కు హర్ట్ బ్రేకింగ్ న్యూసే కాదా బాస్. తాజాగా ఇలా ఓ టాప్ హీరోయిన్ కూడా తన పెళ్లి గురించి కీలక ప్రకటన చేసింది. తన డైహార్ట్ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది. పైగా ఆ ముద్దుగుమ్మ తన ప్రియుడితో ఏకంగా పది సంవత్సరాలు డేటింగ్ ఉన్నాననీ, త్వరలో తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామని ప్రకటించింది. ఇంతకీ.. ఆ హీరోయిన్ ఎవరు, ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం.

ప్రస్తుతం సౌత్ ఇండియాలో వరుసగా హిట్స్ తో దూసుకపోతున్న క్రేజీ హీరోయిన్లలో ప్రియా భవానీ శంకర్ ఒకరు. కెరీర్ ప్రారంభంలో న్యూస్ ఛానెల్ లో యాంకర్ పనిచేసిన ఈ బ్యూటీ అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. నేడు సౌత్ ఇండియాలో టాప్
హీరోయిన్ గా ఎదిగింది. ఈ క్రమంలో సౌత్ ఇండియాలో సీనియర్ హీరోస్ అయినా.. విశాల్, ధనుష్, కార్తి వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. తన నటనతో విమర్శకులను సైతం మెప్పించింది.

Priya Bhavani Shankar Marriage Date Announced - Getting Married With Raj Vel

ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. భామ భీమా, కల్యాణం కమనీయం, ధూత(వెబ్ సిరీస్), భారతీయుడు-2 వంటి సినిమాల్లో నటించి.. తన అందం, అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేసింది. తాజాగా ఈ బ్యూటీ ప్రస్తుతం 'డెమోంటే కాలనీ 2' సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ ఈ నెల (ఆగస్టు) 15 వ తారీకున థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఈ అమ్మడు ప్రియ భవానీ తన ఫ్యాన్స్ కు షాకింగ్ లాంటి గుడ్ న్యూస్ చెప్పింది.

Priya Bhavani Shankar Marriage Date Announced - Getting Married With Raj Vel

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న తాను పదేళ్లుగా రాజ్ అనే వ్యక్తితో డేటింగ్ లో ఉన్నానని తెలిపింది. త్వరలోనే బ్యాచిలర్ లైఫ్ కు బై బై చెప్పేసి.. అతనితో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నానని తెలిపింది. ఈ భామ తన ప్రియుడు రాజ్‌ గురించి చెబుతూ.. అతడు తన జీవితంలోకి రావడం తన అదృష్టం అని పేర్కొన్నారు. తను సపోర్టు తోనే తాను ఈ స్థాయిలో ఉన్నాననీ, తాను లేకపోతే.. ఇప్పటికీ ఒక మధ్య తరగతి యువతిగానే ఉండేదాన్నని అన్నారు. వచ్చే ఏడాది కచ్చితంగా తన ప్రియుడితో పెళ్లి పీటలు ఎక్కబోతున్నని చెప్పేసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆమెకు ఫ్యాన్స్, నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

More from Filmibeat

Read more about: priya bhavani shankar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X