లవ్ ప్రపోజల్‌ను తిరస్కరించిన క్రేజీ హీరోయిన్‌.. బెడిసికొట్టిన స్టార్ డైరెక్టర్ లవ్ మ్యాటర్

ఖుషీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ప్రతిభావంతుడైన దర్శకుడు ఎస్‌జే సూర్య ప్రస్తుతం నటుడిగా బిజీగా మారిపోయాడు. క్యారెక్టర్, విలన్ పాత్రలతో ఆకట్టుకొంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాధా మోహన్ దర్శకత్వం వహించే బొమ్మై అనే చిత్రంలో ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమా సెట్లో హీరోయిన్‌ ప్రియా భవానీ శంకర్‌కు చేసిన లవ్ ప్రపొజల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అయితే తన లవ్ ప్రపోజల్ గురించి ఎస్‌జే సూర్య స్పందించారు. వివరాల్లోకి వెళితే..

సినిమా సెట్లో ప్రేమ చిగురించి

సినిమా సెట్లో ప్రేమ చిగురించి

బొమ్మై చిత్ర షూటింగ్‌లో ప్రియా భవానీ శంకర్‌తో చాలా చనువుగా ఉండటం కనిపించింది. వారిద్దరి మధ్య స్నేహం మరో లెవెల్‌కు వెళ్లడం ఆ క్రమంలోనే తన మనసులోని మాటను చెప్పడంతో ప్రియా భవానీ షాక్ గురైందట. వెంటనే సూర్య ప్రపోజల్‌ను తిరస్కరించడంతో ఆయన కొంత నిరాశకు లోనయ్యారని తమిళ మీడియాలో ఓ వార్త వైరల్ అయింది.

ప్రేమ వ్యవహారం బెడిసి కొట్టిందనే విషయంపై

ప్రియా భవానీ శంకర్‌తో తన ప్రేమ వ్యవహారం బెడిసి కొట్టిందనే వార్తపై ఎస్‌జే సూర్య ఘాటుగా స్పందించారు. కొద్ది మంది ఇడియెటస్ తప్పుడు న్యూస్‌ను ప్రచారం చేశారు. ప్రియా భవానీ శంకర్‌కు నేను లవ్ ప్రపోజల్ చేశారనే వార్తలో ఎలాంటి వాస్తవం లేదు అని ఎస్‌జే సూర్య ట్వీట్ చేశారు.

ప్రియా నేను గుడ్ ఫ్రెండ్స్

ప్రియా నేను గుడ్ ఫ్రెండ్స్

ప్రియా భవానీ శంకర్‌తో నాకు మంచి రిలేషన్ ఉంది. మేమిద్దరం మంచి స్నేహితులం. మాన్‌స్టర్ సినిమాలో నటించినప్పటి నుంచి చాలా క్లోజ్‌గా ఉంటున్నాం. అలాంటి మా బంధంలో చిచ్చు పెట్టే విధంగా వార్తలు రాయవద్దు. చెత్త వార్తలతో నన్ను ఇరిటేట్ చేయవద్దు. థ్యాంక్స్ SJS అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

కమల్‌తో ప్రియా భవానీ శంకర్

కమల్‌తో ప్రియా భవానీ శంకర్

ప్రియా భవానీ శంకర్ విషయానికి వస్తే.. విలక్షణ నటుడు కమల్ హాసన్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఇండియన్ 2 చిత్రంలో నటిస్తుననది. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, హరీష్ కల్యాణ్, అథర్వ, దుల్కర్ సల్మాన్, అరుణ్ విజయ్ తదితరుల నటిస్తున్నారు. ఇటీవల కాలంలో ఎస్‌జే సూర్య ఇరైవి, స్పైడర్, మెర్సల్ లాంటి చిత్రాలతో మెప్పించిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X