twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పక్క రాష్ట్రం నుంచి వచ్చి భ్రష్టుపట్టిస్తోంది: అమలా పాల్‌పై పోలీస్ కంప్లయింట్

    |

    Recommended Video

    Politician Priya Rajeshwari Lodged A Complaint Against Amala Paul || Filmibeat Telugu

    హీరోయిన్ అమలా పాల్ ప్రస్తుతం తన తాజా చిత్రం ఆడై(తెలుగులో 'ఆమె') చిత్రాన్ని ప్రమోట్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. రత్నకుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ జులై 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో అమలా పాల్... కామిని అనే ఇండిపెండెంట్ గర్ల్ పాత్రలో కనిపించబోతోంది. ఓ సీన్లో ఆమె పూర్తి నగ్నంగా నటించడం సినిమాకే హైలెట్. ఆ సీన్ కారణంగానే అంచనాలు భారీగా పెరిగాయి. అదే సమయంలో వివాదాలు, విమర్శలు చుట్టుముట్టాయి. అయితే తమిళనాడులో ఈ మూవీ మరింత గడ్డుపరిస్థితి ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. తాజాగా అమలా పాల్‌పై ఓ పొలిటీషిన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    అమలా పాల్ మీద పోలీసులకు ఫిర్యాదు

    అమలా పాల్ మీద పోలీసులకు ఫిర్యాదు

    ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పిఎంకె నుంచి బయటకు వచ్చి సొంతగా పార్టీ పెట్టిన పొలిటీసియన్ ప్రియా రాజేశ్వరి అమలా పాల్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆమె వల్ల తమిళ సంస్కృతి, సాంప్రదాయాలకు విఘాతం కలుగుతోందన్నారు.

    పక్కరాష్ట్రం నుంచి వచ్చి భ్రష్టుపట్టిస్తోంది

    పక్కరాష్ట్రం నుంచి వచ్చి భ్రష్టుపట్టిస్తోంది

    అమలా పాల్ పక్కరాష్ట్రం కేరళకు చెందిన అమ్మాయి. తమిళ సంస్కృతి గురించి పట్టించుకోవడం లేదు. ఆమె లక్ష్యం కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే. డబ్బు, పబ్లిసిటీ కోసమే అమలా పాల్ పాకులాడుతోందని, అందుకే న్యూడ్ సీన్స్‌లో నటించింది. ఆమె చేసే పనులు తమిళ కల్చర్‌ను కించపరిచే విధంగా ఉన్నాయని ఆరోపించారు.

    ఆ సీన్లు యువతను చెడుదారిలో పోయేలా చేస్తాయి

    ఆ సీన్లు యువతను చెడుదారిలో పోయేలా చేస్తాయి

    ‘ఆడై' చిత్రంలోని న్యూడ్ సీన్లు తమిళ యువతను పక్కదారి పట్టిస్తాయని, వారు అత్యాచారయత్నాలకు పాల్పడే అవకాశం ఉంది. వెంటనే సినిమా నుంచి వాటిని తొలగించాలి. సినిమాకు ‘ఎ' సర్టిఫికెట్ ఇచ్చారే తప్ప ఆ సీన్లను తొలగించలేదు, నగ్న పోస్టర్లతో సినిమా ప్రచార కార్యక్రమాలు చేయవద్దని ఇప్పటికే పోలీసులు డిస్ట్రిబ్యూటర్లకు సూచించారని ప్రియా రాజేశ్వరి తెలిపారు.

    ఆడై

    ఆడై

    ‘ఆడై' చిత్రం తెలుగులో ‘ఆమె' పేరుతో విడుదల కాబోతోంది. తమిళ చిత్రం 'మయాతా మాన్' మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రత్నకుమార్ దర్శకత్వం వహిస్తుండగా 'వి స్టూడియోస్' సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. జులై 19న ఈ మూవీ వరల్డ్ వైడ్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

    English summary
    Politician Priya Rajeshwari has lodged a complaint against Amala Paul. "Amala Paul hails from another state and does not care about the Tamil culture as her aim is only to make money and become the talking point of the nation." Priya Rajeshwari said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X