ప్రియమణి ఆయన దగ్గర ఏడ్చేసింది
ప్రియమణిపై బ్యాన్ పెట్టే అవకాసం ఉందని తెలియటంతో ఆమె బెంబేలెత్తిపోతోంది. అప్పటికీ ఆమె తమిళ చిత్రపరిశ్రమను ఉద్దేశించి.. నేనంత విశ్వాసం లేనిదాన్ని కాదు. గాసిప్స్‌ని పట్టుకొని నన్ను అనటం పద్దతికాదు. అవసరమైతే చేయని తప్పుకు క్షమాపణ చెప్పుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అని ప్రకటించింది. అయినా ఆమె మీద అనధికారికంగా బ్యాన్ కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో ఆమె తనకు పెద్ద దిక్కు లాంటి తమిళ దర్శకుడు భారతీరాజాను కలిసిందని సమాచారం. అయన వద్ద ఏడుస్తూ తన పరిస్ధితి వివరిస్తే ఆయన తప్పని సరిగా నేను పరిశ్రమ పెద్దలతో మాట్లాడి సాల్వ్ చేస్తాను అని ఓదార్చినట్లు చెన్నై ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. అంతేగాక ఆయన తన తాజా చిత్రంలో పార్ధీపన్ సరసన ఆమెను తీసుకున్నారు.
దీనికంతటికి కారణం ప్రియమణి ఆ మధ్య ఇక తమిళ సినిమాలు చేయనని చెప్పిందంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. ఆగ్రహించిన తమిళ చిత్ర పరిశ్రమ ఆమెపై బ్యాన్ పెట్టడానికి రెడీ అయ్యింది. ఈ నేఫద్యంలో ఆమె ఇలా స్పందించింది. దాంతో ఇలా తన ఆవేదనను వ్యక్తం చేస్తూ పరిస్ధితులని చక్క దిద్దే పనిలో పడింది.ప్రియమణి తనకు తెలిసి ఉన్న తమిళ నిర్మాతలు, దర్శకులకు ఫోన్స్ చేసి మరీ తన గోడు వెళ్లబోసుకుంటోంది. కొందరు హీరోలను సైతం ఆమె పర్శనల్ గా కలిసి తనను ఈ సమస్య నుంచి ఒడ్డున పడేమని కోరటం జరిగింది. తెలుగులో ప్రస్తుతం ఆపర్స్ లేని ఆమె తమిళంలోనూ పరిస్ధితి తిరగబడితే కెరీర్ అంతమైనట్లే అని భావించి ఇలా వెంటనే నివారణ చర్యలకు దిగింది.


Click it and Unblock the Notifications











