అందాల'ప్రియమణి' రాక్షస శూర్ఫణఖ

By Staff

Priyamani
అవును...నేషనల్ అవార్డు ఈ మధ్యనే సొంతం చేసుకున్న ప్రియమణి రాక్షస శూర్ఫణఖ పాత్రను చేయబోతోంది. అయితే అలా అందవికారంగా ఆమె కనపడదు. ఆ బుద్దులతో ఉంటుంది. ఇదంతా మణిరత్నం ప్రతిష్ఠాత్మక చిత్రం 'అశోకవనం'లో పాత్రనేట. మోడ్రన్ రామాయణం గా తీస్తున్న ఈ చిత్రంలో మణిరత్నం కథను రావణాసురుడు వైపు నుంచి చూపబోతున్నాడు. అతనెంత తెలివైనవాడు..బలవంతుడు అయినా స్త్రీ మోహం అన్న ఒక్క దుర్గణంతో సర్వ నాశనం అయిపోయాడు అనేదే చూపబోతున్నాడు. ఇక విక్రమ్ చెల్లిగా ప్రియమణి చేస్తోంది.

రాముడ్ని మోహించే ఆమె లక్ష్మణుడు తో అవమానానికి గురై తన అన్న రావణుడుని రెచ్చిగొట్టి రామాయణంకు అసలైన మలుపునిస్తుంది. అందుకే ఆమె పాత్రకూ ప్రత్యేకమైన వెయిట్ ఉంటుంది. కొంచెం నెగిటివ్ టచ్ ఉన్నా చాలా కాలం పాటు గుర్తిండిపోయేలా ఉంటుందంటున్నారు. ఇక ఈ చిత్రంలో ఐష్ సీతగా కనిపిస్తూంటే అభిషేక్ బచ్చన్ రాముడుగా దర్శనమిస్తాడు. కేరళ గవర్మమెంట్ అక్కడ అడవిలో షూటింగ్ కి పర్మిషన్ ఇవ్వకపోవటంతో శ్రీలంక ఫారెస్ట్ లో షూటింగ్ చేయాలని మణిరత్నం భావిస్తున్నారు. యేదైమైనా ప్రియమణి మంచి లక్కీ ఛాన్స్ కొట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X