ప్రియమణి... ద్విపాత్రాభినయం... కేక

By Srikanya

ఇప్పుడు ప్రియమణి ద్విపాత్రాభినయం అంతటా హాట్ టాపిక్ గా మారింది. అయితే అది అవిభక్త కవలలు కావటం విశేషం. అవిభక్త కవలలు అంటే ఒకే శరీరానికి అతుక్కుని పుట్టే కవలలు. ఈ రెండు పాత్రల్లో ఓ అమ్మాయి పేరు చారు, మరో అమ్మాయి పేరు లత. ఒకమ్మాయి దూకుడు మనస్తత్వం గలది అయితే, మరో అమ్మాయి అమాయకురాలు. అంతటి వైరుధ్యం వుంది ఈ పాత్రల నడుమ అని నిర్మాతలు చెప్తున్నారు. ఇక ఈ చిత్రం కన్నడ సినిమా కావటం విశేషం.

మరి సినిమా మొత్తం చారు, లత అతుక్కునే ఉంటారా లేక శస్త్ర చికిత్స ద్వారా విడదీస్తారా? అనేది ప్రస్తుతానికి సీక్రెట్. చారు, లతల్లో ఒక యువతి దూకుడు.. మరో యువతి అమాయకురాలు. ఈ రెండు పాత్రలకు సంబంధించిన సన్నివేశాలను ఒకదాని తర్వాత ఒకటి చిత్రీకరిస్తున్నారు. ఒక సన్నివేశంలో దుడుకుగా, ఆ వెంటనే అమాయకంగా నటించడం అంత సులువు కాదని, దర్శకుడి సహకారంతో చేస్తున్నానని ప్రియమణి పేర్కొన్నారు. తమిళ చిత్రం 'పరుత్తివీరన్'కి ఉత్తమ నటిగా ప్రియమణి జాతీయ అవార్డు అందుకున్నారు. 'చారులత' మరో జాతీయ అవార్డు తెచ్చిపెట్టడం ఖాయం అని కన్నడరంగం వారు అంటున్నారు.

అయితే చారు, లత శరీరాలు సినిమా మొత్తం అతక్కునే ఉంటాయా ! లేక సర్జరీ ద్వారా విడదీస్తారా ! విడదీస్తే ఏమయ్యారు ? అన్న విషయాలు సస్పెన్స్‌గా ఉంచుతున్నారు. ఏమైనా ఈ రెండు పాత్రలు పోషించడం కష్టంగా ఉందనీ, పాత్రల పోషణలో చాలా ఇన్వాల్వ్‌ అవుతున్నానని ప్రియమణి చెబుతోంది. తెలుగులో అవకాశాలు కోల్పోయిన ఈ ముద్దుగుమ్మకు కన్నడ పరిశ్రమ పెద్దపీట వేస్తోంది. ఏకంగా ఒక చిత్రంలో ద్విపాత్రాభినయం చేసే అవకాశం కూడా ఆమెకు వచ్చింది.

ఇక తెలుగులో ప్రియమణి...క్షేత్రం చిత్రం తర్వాత ఆమెకు అవకాశాలు లేకపోయినా కన్నడలో బిజి అవటం ఆమెకు ఆనందం కలగచేస్తోంది. కన్నడంలో పునీత్‌రాజ్‌కుమార్ సరసన ప్రియమణి నటించిన 'అన్నాబాండ్' త్వరలో విడుదల కానుంది. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ యాక్షన్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో కూడా ప్రియమణి మంచి పాత్ర చేశారు. ఈ ఏడాది హిందీలో కూడా మంచి అవకాశం సంపాదించుకున్నారామె. రాజీవ్‌వాలియా దర్శకత్వంలో గోవింద్‌శ్రీవాత్సవ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రానికి హీరో ఎంపిక కావల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X