నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత అందరి కళ్ళూ ప్రియమణి పై పడ్డాయి. దాంతో ఆమె గురించి గాసిప్సూ అధికమయ్యాయి. తాజాగా నెట్ లను యేలుతున్న హాట్ ఐటమ్ ప్రియమణి...ని శంకర్ తన రోబోలో బుక్ చేస్తున్నాడని. ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాలో ఇప్పటికే రజనీకాంత్,ఐశ్వర్య రాయి ఎంపికయ్యారు. ఆ సినిమాలో ఆఫర్ రావడం అంటే మాటలు కాదు. అసలు ఈ మేటర్ ఎలా పుట్టిందంటే...ప్రియమణికి నేషనల్ అవార్డు రాగానే కంగ్రాట్స్ చెపుతూ టెలీగ్రామ్ మెసేజ్ పంపారట. అందులో పరుత్తివీరన్ లో బాగా నటించనందుకు మెచ్చుకోలు ఉందిట. అంతేగాక మనం ఒకసారి మీటవుదాం అని కూడా ఉందిట. అంటే ఓ డైరక్టర్ ...హీరోయిన్ ని ఎందుకు మీటవుతామంటాడు వేషం ఇవ్వటానికి కాకపోతే అన్నది రూమర్స్ సృష్టికర్తల లాజిక్. నిజంగా శంకర్ హీరోయిన్ వేషం ప్రియమణి కి ఇస్తే అదృష్టవంతురాలే.