ప్రియమణికి ఈ సంవత్సరం బాగా కలసివస్తున్నట్లుంది. ఒక ప్రక్క నేషనల్ అవార్డు వచ్చిందన్న ఉషారులో ఉన్నామెకి ఇప్పుడు మణిరత్నం సినిమాలో సెకెండ్ హీరోయిన్ గా ఆఫర్ రావటం వెయ్య యోనుగుల బలాన్నిస్తోంది. అందులోనూ మరో జాతీయ ఉత్తమ నటుడు విక్రమ్ తో కలిసి నటించాల్సి రావటం ఆమె ఊహించని పరిణామం. ఎంతో మంది కలలు గనే మణిరత్నం సినిమాలో ఆఫర్ ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తోందిట. ఆమె దీనిపై స్పందిస్తూ తన జీవితంలోనూ,కెరీర్ లోనూ మరిచిపోలేని సంవత్సరం అంటోంది. ప్రస్తుతం విక్రమ్ 'కందస్వామి' ఫినిషింగ్ చేసే పనిలో ఉన్నాడు. తర్వాత అంటే ఈ సంవత్సరం ఆఖరులో ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
Story first published: Friday, July 17, 2026, 0:04 [IST]