ఆ విషయంలో మగాళ్ళ కన్నా కుక్కలు నయం...ప్రియమణి
మగాళ్ళ కన్నా పెంపుడు కుక్కలే బాగా స్ట్రెస్ నుంచి విముక్తి చేయటానికి ఉపయోగపడతాయని నమ్ముతున్నాను. నిజం చెపుతున్నా పెంపుడు కుక్కలు రియల్ స్ట్రెస్ బస్టర్స్. కానీ మా నాన్నకు ఈ కుక్కలంటే ఇష్టపడరు అంటోంది ప్రియమణి. ఆమెను మీ జీవితంలో ఏ తరహా మగాళ్ళకు ప్రాధాన్యత ఇస్తారు అని మీడియా వారు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. అలాగే ప్రస్తుతం ఎవరితోనన్నా ప్రియమణి రిలేషన్ షిప్ కొనసాగిస్తున్నారా అని అడిగితే ఆమె మండిపడుతూ...నాకు సంభంధం అంటగట్టడానికి ఇంకా ఎవరైనా మిగిలారా...నేను ష్యూర్ గా చెప్తున్నాను...నాకు ఎవరితోనూ సంభంధాలు లేవని..మీరే అనవరసంగా హైలెట్ చేస్తున్నారు అంది. ఇక ప్రస్తుతం ప్రియమణి..మణిరత్నం తాజా చిత్రం రావణ్ లోనూ, రామ్ గోపాల్ వర్మ..రక్త చరిత్రలోనూ ప్రాముఖ్యత ఉన్న పాత్రలు చేస్తోంది. ఇక మగాళ్ళ కన్నా కుక్కలు నయం అనే డెశిషన్ కు ప్రియమణి రావటానికి ఏ మగాడు కారణమా అని ఫిల్మ్ సర్కిల్స్ లో చెవులు కొరుక్కుంటున్నారు.


Click it and Unblock the Notifications











