ప్రియమణి..వీరప్పన్ భార్య వివాదం
గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ జీవత కథతో తెరకెక్కుతున్న చిత్రం వాన యుద్దం. తమిళంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రియమణిని వీరప్పన్ భార్యగా కీలకమైన రోల్ చెయ్యమన్నారని వినిపించింది. అయితే ప్రియమణి అలాంటి డీ గ్లామర్ పాత్రలు చెయ్యమని నిర్విర్దంగా తోసిపుచ్చిందని తమిళ మీడియా కోడే కూసింది. అంతేగాక ప్రియమణి కనిపించినప్పుడల్లా వీరప్పన్ భార్యగా చెయ్యనన్నారుటగా..కారణమేంటి అని అడగటం ప్రారంభించారు. దాంతో ప్రియమణికి ఒళ్లు మండిపోయింది. ఆమె కౌంటర్ గా మీడియాతో మాట్లాడుతూ ఖండించింది.
ప్రియమణి మాటల్లోనే..నేను వీరప్పన్ భార్యగా చేయనన్నానంటూ వార్తలు వస్తున్నాయి. అయితే అవన్నీ రూమర్స్. నన్ను ఆ దర్శకుడు అస్సలు ఆ విషయమై కలవలేదు. కేవలం నేను వేరే ప్రాజెక్టు పనిమీద కలిసాను అంది. ఆయన తన నెక్స్ట్ సినిమా కోసం కబురు పంపితే వెళ్లి కలిసి వచ్చాను. అంతేతప్ప ఈ పాత్ర చేయనని కానీ, చేస్తానని చెప్పలేదు. మొదట ఈ వార్త వినగానే షాక్ అయ్యాను. ఆ తర్వాత నవ్వు వచ్చింది అంది. అలాగే తాను తెలుగులో బిజీగా ఉన్నానని తమిళ మీడియాతో చెప్పింది. ఇంతకీ తెలుగులో ఆమె ఒఫ్పుకున్న సినిమాలు ఏమిటీ అంటే ఆమెనే అడగాలి.


Click it and Unblock the Notifications











