ఆమె రేటు తగ్గినది...సంప్రదించగలరు

By Staff

Priyamani
"నా రేటు తక్కువే...రెమ్యునేషన్ తగ్గించాను! ఒహోయ్" అని ప్రియమణి చాటించే పనిలో బిజీగా ఉంది. కారణం స్వయం కృతాపరాధమే.తెలుగులో 'పెళ్ళైన కొత్తలో', 'యమదొంగ' తరువాత ఆమెకి అంత పేరు తెచ్చే ఆఫర్లు రాలేదు. 'టాస్' లాంటి సినిమాలు టపా కట్టడంతో తమిళమే మేలని అక్కడ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కాని అక్కడా 'పరుత్తివీరన్' ఒకటే చెప్పుకోతగ్గ హిట్టిగా కనపడుతోంది. విశాల్ తో చేసిన 'మలైకోటై' (భయ్యా)పెద్దగా వర్కవుట్ కాలేదు. దాంతో అసలు కారణం ఎక్కడుంగా అని విశ్లేషించి చూడగా సమాధానం దొరికింది. కెరీర్ ప్రారంభంలో నటించిన చిత్రాల్లో సాంప్రదాయమైన పాత్రల్లో నటించడమే తనకు దెబ్బని తెల్సుకుంది. అవి క్లిక్ కావటంతో ప్రియామణికి అన్నీ అలాంటి పాత్రలే రాసాగాయి. అంతేగాక ఆ ఇమేజ్ అడ్డు వచ్చి పెద్ద హీరోల సినిమాల్లో ఆమెకు ఆఫర్లు రావటం కష్టంగా ఉంది.

దాంతో తాను గ్లామరస్‌గా నటించడానికి కూడా రెడీ నే అని ప్రియామణి స్వయంగా ప్రకటించింది. అయితే ప్రియామణి చెప్పిన గ్లామర్ న్యూస్ తెలుగు నిర్మాతలకు వినిపించలేదు. కాని తమిళం వారికి మాత్రం బాగా వినిపించింది. అప్పటి నుండి ఆమెలో అందాలు కనిపించటం ప్రారంభించాయి. అలా కొద్ది కొద్దిగా తమిళంలో ప్రియామణికి బిజీ అయ్యింది. అయితే అలా కాస్త బిజీ కాగానే ప్రియమణి అందరిలా తన పారితోషికాన్ని ఒక్కసారిగా పెంచేసిందట. అయితే ఆ నిర్మాతలకు అది నచ్చలేదు. వారు తమ చిత్రాల్లో ప్రియమణిని తీసుకోవడానికి ఆసక్తి చూపడం తగ్గించేశారట. దాంతో ఏం చేయాలో అర్ధంకాని ప్రియామణి మళ్లీ ముందులాగానే తక్కువ పారితోషికానికే నటించడానికి సిద్ధమైందట. కానీ ఆ విషయం ఇంకా నిర్మాతలను చేరలేదని అందుకే వారు తమ చిత్రాల్లో ప్రియామణిని ఎంపికచేసుకోడానికి ఆసక్తి చూపడం లేదని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. యోదైమైనా కొంతకాలం ఓపిక పడితే బాగుండేదేమో...అంటున్నారు బంగారు బాతు కథ తెల్సిన వారు....

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X