ఆఫర్ల కోసం ఇంత చీప్‌గానా? పవన్ కల్యాణ్‌ను లాగుతూ.. ప్రియాంక అరుల్‌పై విజయ్ ఫ్యాన్స్ ఫైర్
సౌత్ సినిమా దగ్గర మంచి ఫేమ్ తెచ్చుకున్న యంగ్ అండ్ గార్జియస్ హీరోయిన్ లలో తమిళ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్ కూడా ఒకామె.. కాగా ప్రియాంక తమిళ్ లో ఎక్కువ సినిమాలు చేసింది. తెలుగులో చాలా తక్కువ సినిమాలే చేసినప్పటికీ తమిళ్ కంటే తెలుగులో ఎక్కువ ఫేమ్ ని ఈమె సొంతం చేసుకోవడం విశేషం. తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తన అందంతో పెద్దగా గ్లామరస్ షో లేకుండానే మంచి ఫేమ్ ని తెలుగులో సొంతం చేసుకుంది.
తెలుగులో నాచురల్ స్టార్ నానితో తన మొదటి సినిమా గ్యాంగ్ లీడర్ చిత్రం చేసి మంచి డెబ్యూ అందుకుంది. ఈ తర్వాత మళ్ళీ రెండో సినిమా కూడా నాని తోనే చేస్తుంది. ఇదే సరిపోదా శనివారం కాగా ఈ చిత్రాన్ని వివేక్ ఆత్రేయ తెరకెక్కించాడు. అయితే ఈ సినిమా విషయంలోనే సౌత్ సినీ వర్గాల్లో మరో రకంగా ప్రియాంక మోహన్ వార్తల్లో నిలిచింది. కాగా మొన్ననే గ్రాండ్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రియాంక చేసిన కామెంట్స్ తమిళ ఆడియెన్స్ లో ఆగ్రహాన్ని తీసుకొచ్చాయి.

మరి అంతలా ఆమె చేసిన కామెంట్స్ ఏమంటే.. ఈ సినిమాలో నటుడు, దర్శకుడు ఎస్ జె సూర్య కూడా నటించిన సంగతి తెలిసిందే. కాగా ఎస్ జె సూర్య "ఖుషి" అనే భారీ హిట్ ని అక్కడ తమిళ్ లో విజయ్ కి తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి అందించారు. అయితే తెలుగు హిట్ అయ్యిన ఈ సినిమాపై ప్రియాంక కామెంట్స్ చేసింది. ఎస్ జె సూర్య గారు ఒకవేళ ఖుషి 2 గనుక తీస్తే అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారితోనే తియ్యండి అంటూ రిక్వస్ట్ చేసింది.
ఇపుడు ఇదే తమిళ ఆడియెన్స్ కి కోపం దృష్టిలో వాళ్ళ ఖుషి నే గొప్ప. అందుకే సోషల్ మీడియాలో ప్రియాంక పై విరుచుకుపడుతున్నారు. తెలుగులో అవకాశాల కోసం ప్రియాంక ఇంత చీప్ గా ప్రవర్తిస్తావా? అవ్వడానికి తమిళ్ అమ్మాయి అయ్యుండి తమిళ్ హీరోయిన్ అయ్యుండి తమిళ ఖుషి కాదని తెలుగు ఖుషికి సపోర్ట్ చేస్తావా అంటూ సోషల్ మీడియాలో ఆమెపై దారుణంగా ట్రీట్ చేస్తున్నారు.

దీనితో ఈ బ్యూటిఫుల్ హీరోయిన్ ఎప్పుడు లేనిది ఇంత నెగిటివిటీ ఇపుడు ఎదుర్కొంటుంది. అయితే ఆమె ఎక్కడ కూడా విజయ్ పేరుని చెప్పింది లేదు. అయినా కూడా అరవ ఆడియెన్స్ ఇంతలా ట్రిగ్గర్ అయ్యారు. కాగా తమిళ్ ఆడియెన్స్ తో ఇదే కాదు వాళ్ళు రీమేక్ చేసింది గొప్ప అంటారు లేదా వాళ్ళకంటే బెటర్ గా రీమేక్ చేస్తే తట్టుకోలేరు. ఇది చాలా మందికి అర్ధం కాదు.
ఈ విషయంలో మన తెలుగు ఆడియెన్స్ తో కూడా సోషల్ మీడియాలో వార్ చేస్తుంటారు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. ఇక ఇదిలా ఉండగా ప్రియాంక మోహన్ ఇదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో భారీ యాక్షన్ చిత్రం OG అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని సుజీత్ తెరకెక్కిస్తుండగా అతి త్వరలోనే సినిమా షూటింగ్ స్టార్ట్ చేసుకోనుంది అలాగే ఇపుడు పవన్, ప్రియాంకపై కూడా పలు సీన్స్ కూడా బాలన్స్ తెరకెక్కించాల్సి ఉందట.


Click it and Unblock the Notifications











