twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అశోక్‌ది ఆత్మహత్య కాదు.. హత్య: నిర్మాత మృతిపై విశాల్ బహిరంగ లేఖ

    సినీ నిర్మాత అశోక్ కుమార్ మృతిపై విశాల్ చాలా సీరియస్ అయ్యారు. దీనిపై ఓ లేఖ కూడా రాశారు. ‘అశోక్‌ది ఆత్మహత్య కాదు.. హత్య’ అంటూ ఆ లేఖలో సంచలన విషయాన్ని వెల్లడించారు.

    |

    తమిళనాడులో ఏ చిన్న సంఘటన జరిగినా నడిగర్ సంఘం తరుపున హీరో విశాల్ వెంటనే రియాక్ట్ అవుతారు. తాజాగా సినీ నిర్మాత అశోక్ కుమార్ మృతిపై విశాల్ చాలా సీరియస్ అయ్యారు. దీనిపై ఓ లేఖ కూడా రాశారు. 'అశోక్‌ది ఆత్మహత్య కాదు.. హత్య' అంటూ ఆ లేఖలో సంచలన విషయాన్ని వెల్లడించారు. అంతేకాకుండా ఫైనాన్సియర్స్‌కి వార్నింగ్ కూడా ఇచ్చారు.

     అశోక్ కుమార్ మృతి పట్ల

    అశోక్ కుమార్ మృతి పట్ల

    అశోక్ కుమార్ ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత శశికుమార్ కు బంధువు. శశికుమార్ నిర్మాణంలో తెరకెక్కిన ఇసన్, పొరలి సినిమాలకు సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు. వీరి నిర్మాణంలో తెరకెక్కిన కోడి వీరం రిలీజ్ సిద్ధంగా ఉంది. అశోక్ కుమార్ మృతి పట్ల పలువురు తమిళ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

     సూసైడ్‌ నోట్‌

    సూసైడ్‌ నోట్‌

    అప్పు ఇచ్చిన వ్యక్తులు తిరిగి చెల్లించమని వేధిస్తుండడంతో మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసింది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని సూసైడ్‌ నోట్‌ ఆధారంగా విచారణ చేప‌డుతున్నారు.

     వేధింపులు

    వేధింపులు

    ప‌లు సినిమాల‌కి స‌హా నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించిన అశోక్‌కి అప్పిచ్చిన‌వారి నుండి వేధింపులు ఎక్కువ కావ‌డంతో బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డి ఉంటార‌ని స‌న్నిహితులు చెబుతున్నారు. ఆయ‌న మృతి ప‌ట్ల కోలీవుడ్ సినీ పరిశ్ర‌మ సంతాపం వ్య‌క్తం చేస్తూ , ఆయ‌న ఆత్మ‌కి శాంతి క‌ల‌గాల‌ని కోరారు.

     ఇదే చివరి ఆత్మహత్య కావాలి

    ఇదే చివరి ఆత్మహత్య కావాలి

    "ఫైనాన్సియర్ల ఒత్తిడి కారణంగా నిర్మాత అశోక్ కుమార్ ఆత్మహత్య చేసుకోవడమనేది చాలా బాధాకరం. అప్పుల బాధ కారణంగా ఇదే చివరి ఆత్మహత్య కావాలని కోరుతున్నాను. ఆత్మహత్య అనేది పరిష్కారం కాదు. ఫైనాన్షియర్ల నుంచి బెదిరింపులు వస్తే మా దృష్టికి తీసుకు రావాలని నిర్మాతలకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.

     ఫైనాన్షియర్ల హెరాస్‌మెంట్‌

    ఫైనాన్షియర్ల హెరాస్‌మెంట్‌

    ఫైనాన్షియర్ల హెరాస్‌మెంట్‌కి ఫుల్‌స్టాప్ పెట్టాల్సిన సమయం వచ్చేసింది. నిర్మాతల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలి. పోలీసులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా.. అమాయకుల మరణాలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నా.

    ఫైనాన్షియర్లకు డైరెక్ట్ వార్నింగ్

    ఫైనాన్షియర్లకు డైరెక్ట్ వార్నింగ్

    అలాగే దీనిని ఆత్మహత్యగా కాకుండా హత్యగా పరిగణించాలని కోరుతున్నా. ఫైనాన్షియర్లకు డైరెక్ట్ వార్నింగ్ ఎక్కువ వడ్డీలకు డబ్బులిచ్చి.. నిర్మాతలను, వారి కుటుంబ సభ్యులను హింసించవద్దు. ఈ మరణం తమిళ్ ఇండస్ట్రీలో పెరుగుతున్న దురాగతాలకు ఓ ఉదాహరణ. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిర్మాతమంతా ఒక్కటవుతాం.'' అని విశాల్ తన లేఖలో పేర్కొన్నారు.

    English summary
    Vishal posted a statement on social media which reads, "Devastated to hear the sad demise of a dear friend, Ashok Kumar who sacrificed his life succumbing to the pressure created by financiers.”
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X