కంగువపై ఆస్కార్ విజేత దారుణంగా ట్రోలింగ్.. దేవీ శ్రీ ప్రసాద్ తప్పు చేయలేదంటూ
తమిళ సూపర్ స్టార్ సూర్య నటించిన కంగువ చిత్రం నవంబర్ 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్‌పై భారీ బడ్జెట్ చిత్రంగా ప్రముఖ నిర్మాతలు కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించారు. శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో బాలీవుడ్ తారలు బాబీ డియోల్, దిశా పటానీ నటించారు. ఈ సినిమా రిలీజ్ తర్వాత ప్రశంసలతోపాటు కొన్ని విమర్శలు కూడా భారీగా వినిపించాయి. ఈ విషయంలోకి వెళితే..
కంగువ రిలీజ్ తర్వాత అత్యధికంగా ఫిర్యాదు చేసిన అంశం సౌండ్. అరుపులు, పెడబొబ్బలు, కావాల్సిన దానికంటే ఎక్కువ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా తలనొప్పి తెచ్చిపెట్టిందనే క్రిటిక్స్, నెటిజన్లు కామెంట్ చేశారు. అయితే ఈ సినిమా ఫీల్ గుడ్ అంశాలపై సౌండ్ దెబ్బ కొట్టిందని గట్టిగా కామెంట్స్ చేశాయి. సినిమా రిలీజ్ తర్వాత రసూల్ పూకుట్టి కామెంట్ వైరల్ అయింది.

కంగువ గురించి రసూల్ మాట్లాడుతూ.. నా ఫ్రెండ్ ఒకరు రీకార్డింగ్, సౌండ్ మిక్సింగ్ గురించి ఓ క్లిప్ పంపాడు. ధానిలో ఓ పాపులర్ మూవీలో సౌండ్ మిక్సింగ్ గురించి ఇచ్చిన రివ్యూ చదివి నా హృదయం బాధతో బరువెక్కింది. మేము ఎంతో గౌరవంగా భావించే క్రాఫ్ట్ లౌడ్ సౌండ్ కారణంగా అభాసుపాలవుతుందని చెప్పారు. దీనికి బాధ్యులు ఎవరు? సౌండ్ ఇంజినీర్‌ను తప్పు పట్టాలా? అని ఆస్కార్ అవార్డు విజేత్, ప్రముఖ సౌండ్ డిజైనర్ రసూల్ పూకుట్టి అన్నారు.
అయితే ఈ పాపులర్ సినిమాను హడావిడిగా రిలీజ్ చేసే సమయంలో సరిగా ఫిక్సింగ్ చేయలేదా? సౌండ్ విషయంలో వచ్చిన ఫిర్యాదు ఇండస్ట్రీ వర్గాలు ఓ అడుగు వెనుక వేసేలా చేసింది. ఇలాంటి హోరెత్తే సౌండ్ ఉండే రిపీట్ ఆడియెన్స్ ఉండరు. ఆ తలనొప్పిని ఎవరు భరిస్తారు అంటూ రసూల్ పూకుట్టి సైటెర్ వేశారు.

సౌండ్ విషయంలో రెండు పాయింట్లు తగ్గించాలని ఎగ్జిబ్యూటర్లను రిక్వెస్ట్ చేశాం. లౌడ్ సౌండ్ విషయంలో చాలా కంప్లైంట్స్ వచ్చాయి. దానిని తగ్గించేందుకు వేగంగా చర్యలు చేపట్టాం. మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో దేవీ శ్రీ ప్రసాద్ తప్పేమీ లేదు. ఎక్కువ సౌండ్ ఉండటానికి కారణం సౌండ్ మిక్సింగ్ సరిగ్గా లేకపోవడమే కారణం. ఈ రోజు నుంచి నైట్ షో నుంచి లౌడ్ తగ్గించి కొత్త వెర్షన్‌ను థియేటర్లలో ప్రదర్శిస్తున్నాం అని జానవేల్ రాజా తెలిపారు.


Click it and Unblock the Notifications











