50 మంది మహిళలను పంపి.. అంతుచూస్తాం... నిర్మాత బెదిరింపు.. వీడియో షేర్ చేసిన చిన్మయి

తమిళ చిత్ర పరిశ్రమలో సింగర్ చిన్మయి శ్రీపాద, సినీ రచయిత వైరముత్తు మధ్య వివాదం ఇప్పట్లో ముగిసేటట్టు కనిపించడం లేదు. ఇటీవల కాలంలో వారి మధ్య నెటిజన్లు, ఇతర వ్యక్తులు చిచ్చుపెట్టే విధంగా కారణమవుతున్నారు. తాజాగా వైరముత్తు అసలు రూపాన్ని బయటపెట్టినందుకు రకరకాలుగా బెదిరింపులు వస్తున్నాయి అని చిన్మయి వాపోయారు. అందుకు రుజువుగా ఓ నిర్మాత బెదిరించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో నిర్మాత ఏమన్నారంటే..

వైరముత్తుకు వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తే

వైరముత్తుకు వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తే

కొద్ది రోజుల క్రితం వైరముత్తుపై చిన్మయి చేసిన లైంగిక ఆరోపణలపై నిర్మాత రాజన్ స్పందిస్తూ.. వైరముత్తు ఎన్నో ఏళ్లు కష్టపడి తనకంటూ ఓ గౌరవాన్ని కూడగట్టుకొన్నారు. ఇప్పుడు ఆయన ప్రతిష్టను దిగజార్చే విధంగా కొందరు కామెంట్లు చేస్తున్నారు. సినీ పరిశ్రమలో అలాంటి వ్యక్తిపై ఆరోపణలు చేయడం తప్పు అని అన్నారు.

 50 మంది మహిళలను పంపి

50 మంది మహిళలను పంపి

వైరముత్తుపై లైంగిక ఆరోపణలు చేయడం మానకుంటే దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆయనపై ఆరోపణలు చేస్తున్న ఆమెకు తగిన బుద్ది చెప్పేందుకు వెనుకాడం. నా ఏరియాలోని 50 మంది మహిళలను పంపి ఆమెకు గుణపాఠం చెబుతాం. వైరముత్తు ఇమేజ్‌ను దిగజారిస్తే.. ఆమె ఇమేజ్‌ను బయటపెట్టేందుకు వెనుకాడం అని నిర్మాత రాజన్ హెచ్చరించారు.

నాకు న్యాయం జరుగుతుందా?

తనను బెదిరిస్తూ నిర్మాత రాజన్ చేసిన ప్రసంగం వీడియోను షేర్ చేస్తూ చిన్మయి మండిపడ్డారు. సినీ పరిశ్రమలో ఇలాంటి పెద్దలు ఉంటే నాకు న్యాయం ఎప్పటికీ జరుగదు. నా ఆరోపణలు రుజువు చేయాలంటే ఇంటర్నేషనల్ కోర్టు దర్యాప్తు చేయాల్సిందే అని చిన్మయి అన్నారు.

 వైరముత్తును వివాహం చేసుకో

వైరముత్తును వివాహం చేసుకో

ఇదిలా ఉండగా, ఓ నెటిజన్ ప్రశ్నకు సమాధానం ఇస్తూ నాతో అనుచితంగా ప్రవర్తించిన వైరముత్తును ఈసారి కనిపిస్తే అతడి చెంప పగులకొడుతాను అంటూ వ్యాఖ్యానించింది. అందుకు ఓ నెటిజన్ స్పందిస్తూ.. నీకు జరిగిన అన్యాయానికి వైరముత్తును పెళ్లి చేసుకో.. ఆ సమస్య తీరిపోతుంది అని అన్నాడు. దానికి జవాబిస్తూ థ్యాంక్స్.. గొప్ప సలహా ఇచ్చావు అంటూ చిన్మయి కామెంట్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X