మహేష్, పవన్‌ను మించి విజయ్‌కి రికార్డు రెమ్యునరేషన్.. మాస్టర్ కోసం తీసుకొన్నది ఎంతంటే!
గత కొన్నేళ్లుగా తమిళ సూపర్‌స్టార్ విజయ్ కోలీవుడ్‌లో ప్రతీ సినిమాకు కలెక్షన్లను, రెమ్యునరేషన్‌ను పెంచుకొంటూ పోతూనే ఉన్నారు. తాజాగా రిలీజ్ కానున్న మాస్టర్ సినిమా కోసం విజయ్ తీసుకొంటున్న రెమ్యునరేషన్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. విజయ్ పారితోషికం గురించి తమిళ నిర్మాత చేసిన వ్యాఖ్యలు దక్షిణాదిలో సంచలనంగా మారాయి. ఇంతకు తమిళ నిర్మాత ఎలాంటి వ్యాఖ్యలు చేశారు? విజయ్ రెమ్యునరేషన్ ఎంత అంటే..

భారీగా విజయ్ మూవీ కలెక్షన్లు
తమిళంలో కెయ్యార్ అనే నిర్మాత మీడియాతో మాట్లాడుతూ.. తమిళనాడు కాకుండా కేరళ, కర్ణాటకలో విజయ్ మార్కెట్ బ్రహ్మండంగా ఉంది. తమిళనాడులోనే మాస్టర్ సినిమా రూ.100 కోట్లు వసూలు చేసినా ఆశ్చర్య పోనక్కర్లేదు. అయినా విజయ్ తన సినిమా కలెక్షన్ల విషయంలో అసంతృప్తిగానే ఉన్నారు. థియేటర్లు పెంచి బిజినెస్‌ను కూడా మరో రెంజ్‌కు తీసుకెళ్లాలని చూస్తున్నాడు అని అన్నారు.

ఆంధ్రాతో పోల్చితే స్క్రీన్లు
ఆంధ్రాతో పోల్చితే తమిళనాడులో తక్కువ స్క్రీన్లు ఉన్నాయి. ఆంధ్రాలో 2 వేలకుపైగా స్క్రీన్లు ఉన్నాయి. భారీ బడ్జెట్ చిత్రం 1000 స్క్రీన్లకుపైగా రిలీజ్ అవుతాయి. అదే తమిళంలో అయితే బిగ్ ప్రాజెక్ట్ కేవలం 500 థియేటర్లలో మాత్రమే విడుదల అవుతుంది. నిబంధనలను సరళీకృతం చేసి ఎక్కువ థియేటర్లకు తమిళనాడు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి అని నిర్మాత కెయ్యార్ తెలిపారు.

యావరేజ్ టాక్‌కే రికార్డు వసూళ్లు
తాజాగా బిగిల్ చిత్రం తమిళ సినిమా సత్తాను తెలియజెప్పింది. యావరేజ్ టాక్‌తో వచ్చిన చిత్రం భారీ రేంజ్‌లో బిజినెస్ చేసింది. అదే సూపర్ హిట్ టాక్‌తో వస్తే కలెక్షన్లను ఊహించలేం. విజయ్, అజిత్, రజనీకాంత్ లాంటి హీరోలు కంటెంట్‌తో సంబంధం లేకుండా ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తారు అని కెయ్యార్ పేర్కొన్నారు.
Recommended Video


విజయ్‌కి రూ.100 కోట్ల రెమ్యునరేషన్
ఇక తమిళనాడులో హయ్యెస్ట్‌గా పారితోషికం తీసుకొనే హీరో కేవలం విజయ్ మాత్రమే అనే విషయం బిగిల్‌తో రుజువైంది. బిగిల్ సినిమాకు తమిళనాడులోనే 75 కోట్ల షేర్ సాధించింది. మాస్టర్ సినిమా రూ.100 కోట్లు వసూలు చేయడం ఖాయం. ఈ సినిమా కోసం ఆయన రూ.100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకొనే సత్తా కలిగిన నటుడు అని విజయ్‌పై కెయ్యార్ ప్రశంసలతో ముంచెత్తారు. అయితే రెమ్యునరేషన్ కింద విజయ్ తమిళనాడు హక్కులను తీసుకొన్నారనే వార్త ప్రచారంలో ఉంది.


Click it and Unblock the Notifications











