అతను పెద్ద మోసగాడు.. స్టార్ హీరోపై నిర్మాత ఫైర్.. ఏం జరిగిందంటే?
కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోల్లో అజిత్ కుమార్ ఒకరు. ఆయన యాక్టింగ్, చేసే యాక్షన్ సీన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకే అజిత్ కు తెలుగు రాష్ట్రాల్లో కూడా అభిమానులు ఉన్నారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో అలరించిన అజిత్ ను అభిమానులు ముద్దుగా తలా అని పిలుచుకుంటారు.
అయితే ఎంతో బిగ్ హీరో అయినప్పటికీ డౌన్ టు ఎర్త్ ఉంటారని అంటుంటారు. కానీ అవేవి నిజం కాదని, అజిత్ పెద్ద మోసగాడు అని ఓ నిర్మాత తెగ ఫైర్ అయ్యారు. అసలు ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..

తునివుతో: తమిళ స్టార్ హీరో అజిత్ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఆయనకు తెలుగులో కూడా కొంతమేర ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే ఆయన సినిమాలు తెలుగులోనూ అప్పుడ్పుడు విడుదలై అలరిస్తుంటాయి. ఎన్నో బాక్సాఫీస్ హిట్స్ ఇచ్చిన అజిత్ ఇటీవలే తెగింపు తమిళంలో తునివు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా ప్రస్తుతం ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

తీవ్ర ఆరోపణలు: అయితే ప్రస్తుతం సినిమాలకు కాస్తా గ్యాప్ ఇచ్చిన అజిత్ పై కోలీవుడ్ ప్రొడ్యూసర్ మాణిక్యం నారాయణన్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన వద్ద అజిత్ డబ్బు తీసుకుని, ఇప్పటికీ తిరిగి ఇవ్వలేదని, అతను ఒక మోసగాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అజిత్ గురించి తాజాగా మాణిక్యం నారాయణన్ మీడియాకు చెప్పారు.
డబ్బు లేదు-సినిమా లేదు: "అజిత్ తన తల్లిదండ్రులను సెలవుపై మలేషియాకు పంపాలని చాలా సంవత్సరాల క్రితం నా నుంచి డబ్బు తీసుకున్నాడు. అప్పట్లో నాకోసం ఒక సినిమా చేస్తానని మాట ఇచ్చాడు. రెమ్యునరేషన్ లో ఆ డబ్బు సర్దుబాటు చేస్తానని కూడా ప్రామిస్ చేశాడు. కానీ, ఈరోజు వరకు కూడా ఆ డబ్బు తిరిగి ఇవ్వలేదు. అంతేకాదు.. నాతో సినిమా సైతం చేయలేదు" అని నిర్మాత మాణిక్యం మండిపడ్డారు.

బాగానే సంపాదన: "ఇన్నేళ్లలో అజిత్ దీని గురించి మాట్లాడటం మానేశాడు. అతను తనను తాను పెద్దమనిషిగా అనుకుంటాడు. కానీ, అది నిజం కాదు. ఇప్పుడు అతనొక స్టార్ హీరో. ప్రతి సినిమాకు రూ. 50 కోట్లకుపైగానే సంపాదిస్తున్నాడు. కాబట్టి నాకు రావాల్సిన డబ్బు ఇచ్చేయొచ్చు కదా" తమిళ నిర్మాత మాణిక్యం నారాయణన్ చెప్పుకొచ్చారు.
నిర్మాతలకు నష్టాలు: "నాతో పాటు ఏఎమ్ రత్నం వంటి నిర్మాతలు కూడా అజిత్ తో చిత్రాలు నిర్మించి భారీగా నష్టాలు చూశాం. ఇప్పటివరకు నష్టపోయిన నిర్మాతలకు సహాయం కూడా చేయలేదు" అని మాణిక్యం నారాయణన్ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా అజిత్ కు 1996లో మొదట రూ. 6 లక్షలు, 1998లో రూ. 12 లక్షలు ఇచ్చినట్లు మాణిక్యం గతంలో కూడా ఆరోపించారు.


Click it and Unblock the Notifications











