Just In
- 27 min ago
గుడ్ బై చెప్పాలనుకున్నా.. ఎన్టీఆర్, ప్రభాస్‌లతో! అసలు విషయం బయటపెట్టిన వెంకటేష్
- 54 min ago
మొత్తానికి ఫైనల్ చేశారు.. ఇక బాలకృష్ణ కష్టాలకు ఫుల్స్టాప్ పడినట్లేనా?
- 1 hr ago
‘జబర్ధస్త్’ కమెడియన్లపై జానీ మాస్టర్ సీరియస్.. కొరియోగ్రాఫర్ దెబ్బకు భయంతో వణికిపోయారు.!
- 2 hrs ago
వెంకీ మామ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ ఎలా ఉందంటే!
Don't Miss!
- News
Citizenship Bill:బీజేపీయేతర సీఎంలే దేశాన్ని కాపాడాలి..ప్రశాంత్ కిషోర్ ట్వీట్
- Finance
మహిళల కోసం సరికొత్త ఆలోచన: ఫుడ్ స్టార్టప్‌లో బాలీవుడ్ స్టార్ పెట్టుబడి
- Sports
ఐపీఎల్ వేలానికి తుది జాబితా ఖరారు: బెర్త్‌లు 73.. బరిలో 332
- Technology
అమెజాన్ నుంచి ఫైర్ టివి ఎడిషన్ స్మార్ట్
- Lifestyle
శుక్రవారం మీ రాశిఫలాలు 13-12-2019
- Automobiles
2019 లో 10 టాప్ మోస్ట్ గూగిల్డ్ కార్స్
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
హోటల్ రూమ్‌లో ఆ హీరోతో అంజలి.. అలా చెడగొట్టాడు.. నిజాలు బయట పెట్టిన నిర్మాత
హీరో, హీరోయిన్లు తెరపై కనిపించినట్టుగానే ఉంటారన్న నిబంధన ఏదీ లేదు. కొందరు షూటింగ్ వరకు మాత్రమే ఉంటారు..ఇంకొందరు కాస్త ఫ్రెండ్లీగా ఉంటారు.. మరికొంత మంది ఇంకాస్త దూరం జరిగి ప్రేమ బంధాన్ని కూడా ఏర్పర్చుకోవచ్చు. ఇలా హీరో హీరోయిన్ల బంధం గురించి వచ్చే వార్తలపై అందరూ ఆసక్తిని కనబరుస్తారు. ఇలాంటి ఓ ఘటనే తాజాగా బయటకు వచ్చింది. అది బయట పెట్టింది కూడా మరెవరో కాదు వారి చిత్రాలను నిర్మించిన నిర్మాత.

నిర్మాత షాకింగ్ కామెంట్స్..
ఆ హీరో ఆ హీరోయిన్ తో కలిసి ఒకే రూమ్ లో ఉండేవారన్న షాకింగ్ వ్యాఖ్యల్ని ఒక నిర్మాత అంత బాహాటంగా వెల్లడించటం ఇప్పటివరకూ ఎక్కడా చూసింది లేదు. తాజాగా అలాంటి వ్యాఖ్యలే చేసి సంచలనంగా మారారు నిర్మాత నంద కుమార్. హీరో జై.. హీరోయిన్ అంజలి రిలేషన్ మీద షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు.

జర్నీ చిత్రంతో మొదలు
జై.. అంజలి ఇద్దరు కలిసి తొలుత జర్నీ సినిమాలో నటించారు. ఈ సినిమా హిట్ అవ్వడమే కాకుండా వీరిద్దరి జంటకు మంచి ప్రశంసలు లభించాయి. అయితే ఆ చిత్రంతోనే వీరిద్దరి మధ్య ప్రేమ మొదలైందనే వార్తలు గుప్పుమన్నాయి. ఆపై వీరిద్దరు బెలూన్ చిత్రంలో నటించారు. వీరిపై వస్తోన్న వార్తలు ఎప్పుడు ఖండించలేదు.. అలా అని వారెప్పుడూ ఒప్పుకోను లేదు.

జై కారణంగా నష్టం..
అంజలి మంచి అమ్మాయే కానీ.. జై ఎంట్రీ తర్వాత ఆమెను మార్చేశాడని అన్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక విషయాల్ని వెల్లడించాడు. జై కారణంగా తాను చాలా నష్ట పోయినట్లు చెప్పిన నందకుమార్.. అందుకు సంబంధించిన విషయాల్ని రివీల్ చేశారు.

ఒకే రూమ్‌లో..
కొడైకెనాల్ లో హీరో జైకు.. హీరోయిన్ అంజలికి వేర్వేరు గా రూములు బుక్ చేశామని.. కానీ వారిద్దరూ ఒకే రూమ్ లో ఉండేవారన్నారు. సరే.. ఒక రూమ్ క్యాన్సిల్ చేస్తామంటే వద్దనే వారని.. ఈ కారణంగా రోజుకు రూ.12వేలు చొప్పున నష్ట పోయినట్లు చెప్పారు.

అలా చెడగొట్టేశాడు..
ఒక రోజు షూట్ జరుగుతున్నప్పుడు మేడమ్ అని కాకుండా.. అంజలి అని పిలిచినందుకు నానా రచ్చ చేశాడు. ఆమె ఏం ఫీల్ కాలేదు కానీ జై మాత్రం రెచ్చిపోయాడు. షూటింగ్ క్యాన్సిల్ చేస్తానని బెదిరించాడు. ఆపై అంజలికి కడుపు నొప్పి అని చెప్పి తీసుకెళ్లిపోయాడు. అలా ఆరోజు షూటింగ్‌ను చెడగొట్టేశాడని చెప్పుకొచ్చాడు.