వనితా విజయ్ కుమార్‌తో నిర్మాతకు ముదిరిన వివాదం.. ఆమె పిల్లల చదువు, పెళ్లిళ్లు అంటూ కామెంట్
వనితా విజయ్ కుమార్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాను ఊపేస్తోన్న. మూడో పెళ్లి చేసుకోవడంపై ఎవ్వరికీ ఎలాంటి అభ్యంతరాలు లేకపోయినా.. ఆ పెళ్లి జరిగిన తీరుపై అందరూ విమర్శిస్తున్నారు. వనిత పీటర్ పాల్ ఇద్దరూ పెళ్లి చేసుకున్న విషయం వివాదంగా మారడానికి కారణం ఒకటి ఉంది. అదే పీటర్ పాల్ భార్య ఎలిజబెత్ హెలెన్. తనకు విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి ఎలా చేసుకుంటారని ఎలిజబెత్ ఫిర్యాదు చేయడంతో మలుపు తిరిగింది. అప్పటి నుంచి ఈ మూడోపెళ్లిపై రోజుకో రకమైన చర్చ నడుస్తూనే ఉంది.

పీటర్ భార్య ఫిర్యాదు..
వనితతో జరిగే పెళ్లి కేవలం షూటింగ్ కోసమేనని తనను మోసం చేశారని ఎలిజబెత్ ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా పీటర్ ఓ తాగుబోతు, స్త్రీలోలుడని చెప్పుకొచ్చింది. తన భర్త తనకు విడాకులు ఇవ్వకుండా ఎలా పెళ్లి చేసుకుంటాడని ఫైర్ అయింది. ఈ విషయంపై సోషల్ మీడియాలో వనితపై అందరూ ఫైర్ అవుతున్నారు.

రివర్స్ ఎటాక్..
తమపై కావాలనే కక్షగట్టి అలా చేస్తోందని ఎలిజబెత్‌పై వనిత ఆరోపణలు చేసింది. ఆమె కావాలని ఇలా చేస్తోందని, తమను బ్లాక్ మెయిల్ చేస్తోందని, డబ్బు గుంజాలని ప్రయత్నిస్తోందని వనిత ఫైర్ అయింది. వనిత నిర్ణయాన్ని తప్పుబడుతూ.. నటి లక్ష్మీ రామకృష్ణన్ ఓ ట్వీట్ చేయగా వనిత ఫైర్ అయింది. తాజాగా ఓ నిర్మాత కూడా వనిత నిర్ణయాన్ని తప్పుబట్టాడు.

నిర్మాత ఫైర్..
వనిత మూడో పెళ్లిపై నిర్మాత రవింద్రన్ ఫైర్ అయ్యాడు. అలా పెళ్లి చేసుకోవడం తప్పని అన్నారు. ఆమె ఆర్థిక పరిస్థితి తనకు తెలుసని అన్నారు. అయితే వనిత ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ... అలా తన గురించి మాట్లాడేవారెవ్వరూ తనకు సాయం చేయరని, ఉన్న పలంగా ఓ నలభై వేలు అవసరముందని అడిగితే ఎవ్వరూ ఇవ్వరని కౌంటర్ వేసింది.
Recommended Video

బాధ్యతలు తీసుకుంటా..
వనితా అలా అనే సరికి.. నిర్మాత రవీంద్రన్ ఇంకాస్త ముందుకు వెళ్లాడు. వనిత సరే అంటే.. ఆమె కూతుళ్లను తాను చదివిస్తానని, పెళ్లి కూడా తానే చేస్తానని, వారి బాధ్యతలు తీసుకుంటానని ప్రకటించాడు. ఇదేమీ వట్టి మాటలు కావని అందరి ముందు ప్రమాణం చేస్తున్నానని చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











