రెమ్యునరేషన్ గొడవ.. వేధింపులంటూ హీరోపై నిర్మాత ఫిర్యాదు
భారీగా రెమ్యునరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వేధిస్తున్నాడనే ఆరోపణలపై నటుడు విమల్ తమిళ నిర్మాత ఫిర్యాదు చేశారు. కలవాణి చిత్రం ఘన విజయం సాధించడంతో అగ్రిమెంట్ వ్యతిరేకంగా ఎక్కువ డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టు సదరు నిర్మాత తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే..

కళింగతుపారాని చిత్రంలో
కళింగతుపారాని చిత్రం గత నవంబర్‌లో సెట్స్ పైకి వెళ్లింది. ఈ చిత్రంలో హీరోగా విమల్‌ను బుక్ చేసుకొన్నాడు షణ్ముగవేల్. ఈ చిత్రంలో నటించేందుకు గానూ పారితోషికంగా రూ.6 లక్షల జీతాన్ని ఇచ్చే విధంగా ఒప్పందం కుదిరింది.

అగ్రిమెంట్‌కు ఓకే
పారితోషికానికి సంబంధించిన అగ్రిమెంట్ సమయంలో ప్రస్తుతం తాను కలవాణి చిత్రంలో నటిస్తున్నాను. ఆ సినిమా పూర్తయిన తర్వాత తాను కళింగతుపారాని చిత్రంలో నటిస్తానని విమల్ తన అంగీకారం తెలిపాడట.

విమల్‌పై నిర్మాత షణ్ముగవేల్ ఫిర్యాదు
అయితే కళింగతుపారాని సినిమా షూటింగ్ సమయంలో కలవాణి సినిమా హిట్ కావడం జరిగింది. ఈ నేపథ్యంలో తన రెమ్యునరేషన్ పెంచాలని విమల్ వేధిస్తున్నాడు. షూటింగ్‌కు హాజరుకానని బెదిరిస్తున్నాడు అని నిర్మాత షణ్ముగవేల్ ఫిర్యాదు చేసినట్టు సమాచారం.

ఆరోపణలపై విమల్ స్పందన
నిర్మాత షణ్ముగవేల్ ఆరోపణలపై విమల్ స్పందించాడు. తాను నిర్మాత నుంచి రూ.60 లక్షల రెమ్యునరేషన్‌ను డిమాండ్ చేయలేదు అని వివరణ ఇచ్చారు. దర్శకుడికి, నిర్మాతకు మధ్య విభేదాలు తలెత్తడంతో సినిమా నిలిపివేశారు.

నా తప్పు కాదన్న విమల్
కళింగతుపారాని ఆగిపోవడంతో తాను మరో సినిమాకు డేట్స్ ఇచ్చాను అని విమల్ పేర్కొన్నాడు. అయితే తాజాగా సినిమాను ప్రారంభిస్తున్నాను. తిరిగి డేట్స్ ఇవ్వాలని నిర్మాత నన్ను బలవంతం చేస్తున్నాడని ఆయన చెప్పారు. ఈ విషయంలో నన్ను తప్పుపట్టడం సరికాదు అని అన్నారు.


Click it and Unblock the Notifications











