»   »  నయనతార ఇంటిపై ఏసీబీ దాడి చేయించాలని, నిర్మాత ప్లాన్, కారణం అదే?

నయనతార ఇంటిపై ఏసీబీ దాడి చేయించాలని, నిర్మాత ప్లాన్, కారణం అదే?

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: నయనతార అంటే ఇప్పుడు చాలా మంది నిర్మాతలకు మండిపోతోంది. ఎందుకూ అంటే ఆమె ఇప్పుడు టాప్ హీరోయిన్. అందరికీ ఆమె డేట్స్ కావాలి. కానీ ఆమె తనకు నచ్చిన నిర్మాతకు, తనను మెప్పించే డైరక్టర్ కు డేట్స్ ఇస్తోంది. ముఖ్యంగా స్టార్ హీరోల ప్రక్కన అంటే ఇంట్రస్ట్ చూపటం లేదు. అలాగని ఆమె ను ప్రక్కన పెడదామంటే ఆమె పోస్టర్ పై కనపడితే చాలు ఓపినింగ్స్ అదిరిపోతున్నాయి.

ఈ నేపధ్యంలో నిర్మాతలు కొందరు ఆమెపై పగ తీర్చుకునే కార్యక్రమాలు పెట్టుకున్నట్లు చెన్నై సినిమా వర్గాల సమాచారం. అందుకు ఆమె రెమ్యునేషన్ తీసుకునే విధానాన్నే ఆడ్డం పెట్టుకోదలిచారు. తమిల చిత్ర పరిశ్రమలోనూ, టాలీవుడ్‌లోనూ అత్యధిక రెమ్యునరేషన్‌ తీసుకునే హీరోయిన్‌ ఎవరూ అంటే టక్కున అందరూ నయనతారే అని చెబుతారు.

 Nayanthara

నయనతార సినిమాకి మూడు కోట్లు తీసుకుంటుంది. ఈ రెమ్యునేషన్ ని కూడా.. సగం, వైట్‌గానూ, సగం బ్లాక్‌గానూ తీసుకోవడం నయనకు అలవాటు. ఇప్పుడు పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో బ్లాక్‌ అంతా వైట్‌ చేసి ఇవ్వమని నిర్మాతలకు నయన ఆర్డరు వేస్తోందిట. అసలే ఎక్కువ ఇస్తున్నామని బాధపడుతున్నవారికి నయన ఆర్డర్‌ పుండుమీద కారం చల్లినట్లు అయ్యిందిట.

దాంతో ఎలాగైనా సరే ఆమె మీద ఏసీబీ దాడి చేయించాలని పలువురు నిర్మాతలు ఆలోచనలో ఉన్నారట. మరి వారు ఎలా ప్లాన్ చేస్తారో ఏమిటో. ఈ విషయం మనకే తెలిసినప్పుడు నయనతార కు తెలియదా..ఆమె జాగ్రత్త పడదా..మన పిచ్చిగాని అంటున్నారు మరికొందరు నిర్మాతలు.

English summary
Producers are etching plans to give tip-off to Income Tax officials and persuade them to conduct raids on this top actress Nayantara's properties.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu