హీరో విశాల్‌కు స్నేహితుల వెన్నుపోటు.. భారీ ఎదురుదెబ్బ!

Recommended Video

TN Producers Riot Demand Vishal's Resignation As TFPC President | Filmibeat Telugu

విశాల్ తమిళ హీరో అయినప్పటికీ తెలుగువారికి కూడా బాగా చేరువయ్యాడు. విశాల్ కు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. అన్ని కార్యక్రమాల్లో విశాల్ చురుకుగా పాల్గొంటుండడం చూస్తూనే ఉన్నాం. రాజకీయాలు, సినిమాలు, సేవ కార్యకమాలు ఇలా ప్రతి చోటా విశాల్ ప్రమేయం ఉంటుంది. తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన నడిగర్ సంఘంలో విశాలో చురుకైన పాత్ర పోషిస్తున్నాడు. నడిగర్ సంఘం ఎప్పుడూ ఎదో ఒక వివాదానికి కేంద్ర బిందువుగా మారుతూనే ఉంది. నడిగర్ సంఘం నిర్మాతల మండలికి విశాల్ అధ్యక్షుడిగా ఉన్నారు. మరో మారు నడిగర్ సంఘంలోని లుకలుకలు బయట పడ్డాయి.

ప్రొడక్షన్ వ్యాల్యూస్

ప్రొడక్షన్ వ్యాల్యూస్

2017లో హీరో విశాల్ తమిళ నిర్మాతల మండలికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. విశాల్ అన్ని కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ తన విధులు నిర్వహిస్తున్నాడు. అయినా కూడా కొందరు నిర్మాతల్లో విశాల్ పట్ల అసంతృప్తి ఉంది. తరచుగా ఎవరో ఒకరు విశాల్ అధ్యక్షుడిగా ఉండదని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. దానిని ఎప్పుడూ విశాల్ సీరియస్ గా తీసుకోలేదు.

 సొంత స్నేహితులే వెన్నుపోటు

సొంత స్నేహితులే వెన్నుపోటు

విశాల్ పక్కనే ఉంటూ అతడికి వెన్నుదన్నుగా నిలుస్తున్న స్నేహితులు సైతం వెన్నుపోటు పొడిచినట్లు తెలుస్తోంస్తుంది. విశాల్ స్నేహితులైన ఆర్కే సురేష్, ఉదయ ఇప్పుడు వ్యతిరేక వర్గంలో చేరి అతడిని అధ్యక్ష పదవి నుంచి దించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు 50 మంది నిర్మాతలు తమిళ నిర్మాతల మండలి కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఆందోళనలో ఆర్కే సురేష్, ఉదయ కూడా పాల్గొన్నారట.

సొంత పనులు

సొంత పనులు

విశాల్ తన అధ్యక్ష పదవిని నిర్మాతల కోసం ఉపయోగించకుండా సొంతపనులు వాడుకుంటున్నాడనేది చాలా మంది నిర్మాతల అభియోగం. నిర్మాతలంతా ఆందోళన నిర్వహించే సమయంలో విశాల్ కార్యాలయంలో లేడట. దీనితో ఇక విశాల్ ఆఫీస్ లో అడుగు పెట్టకూడదని కార్యాలయానికి తాళం వేసి దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్ లో అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ వివాదంపై విశాల్ ఇంకా స్పందించలేదు.

పైరసీని ఎదుర్కొవడంలో

పైరసీని ఎదుర్కొవడంలో

చిత్ర పరిశ్రమలో పైరసీ అనేది నిర్మాతలపట్ల పెనుభూతంలాంటిది. పైరసీ ప్రభావం ఎక్కువగా చిన్న చిత్రాలపై పడుతోంది. ఈ దిశగా విశాల్ చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలం చెందినట్లు పలువురు నిర్మాతలు ఆరోపిస్తున్నారు. విశాల్ నిర్మాతల మండలి అధ్యక్షుడిగానే కాక నడిగర్ సంఘం జనరల్ సెక్రటరీగా కూడా సేవలందిస్తున్నాడు. ఈ వివాదం ఓ కొలిక్కి రావాలంటే విశాల్ వెంటనే నిర్మాతలతో చర్చలు జరపాలని తటస్థంగా ఉన్న నిర్మాతలు సూచిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X